Featured

కమల్ హాసన్ చెంప పగలకొట్టిన ఆమని.. కమల్ ఏమన్నారో తెలుసా..?

తెలుగులో నటిగా గొప్ప పేరు తెచ్చుకొని అవార్డులు అందుకున్న సీనియర్ హీరోయిన్ ఆమని. అచ్చ తెలుగమ్మాయిలా కనిపించే ఈమె లెజండరీ డైరెక్టర్స్ తో పని చేసే అవకాశాలు అందుకుంది. తమిళ, తెలుగు సినిమాలలో ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. కలర్ తక్కువైనా కూడా కొంతకాలం పరభాషా నటీమణులకి గట్టిపోటీ ఇచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకులైన ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చి భారీ సక్సెస్ సాధించిన జంబలకిడిపంబ సినిమాలో నరేష్ సరసన హీరోయిన్ గా నటించి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో వరుసగా పెద్ద దర్శకులతో పనిచేసే అవకాశాలు దక్కించుకుంది.  

మొదటి సినిమా జంబలకిడిపంబ తర్వాత ఆమని నటించిన సినిమా బాపు దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ పెళ్ళాం. ఈ సినిమాలో నటించిన ఆమనికి, ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు దక్కించుకొంది. అలాగే ఈ సినిమాలో నటనకు గాను ఆమనికి ఉత్తమ నటిగా నంది అవార్డ్ కూడా దక్కడం విశేషం. ఇలా రెండవ సినిమాతోనే తన సహజమైన నటనతో జాతీయ ఫిల్మ్ అవార్డు, ఉత్తమ నటిగా నంది అవార్డ్ లను అందుకోవడంతో పలువురు స్టార్ డైరెక్టర్స్ దృష్టి ఆమని పై పడింది. వారిలో స్టార్ డైరెక్టర్ కె విశ్వనాథ్ కూడా ఉన్నారు. ఆయన దర్శకత్వంలో శుభ సంకల్పం అనే గొప్ప సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

శుభ సంకల్పం సినిమాలో ఏ ఒక్కరికీ మేకప్ ఉండదు. అలా ఎంతో సహజంగా దర్శకుడు కె విశ్వనాథ్ తెరకెక్కించారు. లోక నాయకుడు కమల్ హాసన్, ఆమని, ప్రియా రామన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరాం గారు దీనికి ఫొటోగ్రఫీ అందించారు. అంతేకాదు ప్రముఖ గాయకులు శ్రీ ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఈ సినిమాను నిర్మించడం విశేషం. కోదండపాణి ఫిల్మ్ సర్స్క్యూట్ పతాకంపై ఎస్.పి.బి నిర్మించగా, సహ నిర్మాతగా కమల్ హాసన్ వ్యవహరించారు. అంతేకాదు అప్పటి వరకు దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసిన కె. విశ్వనాథ్ ను కమల్ హాసన్ ఈ సినిమాలో మొదటి సారిగా నటించేందుకు ఒప్పించారు.

ప్రియా రామన్ మరో హీరోయిన్‌గా నటించింది. చిత్రీకరణలో భాగంగా మేకప్ ఉండకూడదని అందరూ చెప్పారు. కానీ ఆమని కాస్త కలర్ తక్కువగా ఉండటంతో తాను మేకప్ తీయనని చెప్పిందట. దాంతో స్వయంగా కమల్ హాసన్.. నువ్వు మేకప్ తీసేసి నటించి చూడు..ఎంత అందంగా కనిపిస్తావో అని సలహా ఇచ్చాడట. అంత పెద్ద హీరో చెబుతున్నప్పుడు వినాలి కదా అని ఆమని మేకప్ తీసేసి ఓ సన్నివేశంలో నటిస్తే అది చూసి ప్రతీ ఒక్కరూ ఎంతో అభినందించారట. ఇక ఇదే సినిమాలో  ఓ సన్నివేశంలో ఆమని.. కమల్ హాసన్ ని కొట్టాలి. ఆ సీన్ చేయనని ఆమని పట్టుపట్టిందట. దర్శకుడు కె విశ్వనాథ్ అలాగే కమల్ హాసన్, సినిమాటో గ్రాఫర్ పిసి శ్రీరాం ఇది సినిమా.. జస్ట్ యాక్టింగ్ మాత్రమే కదా అని చెప్పారటా.

సీన్ ప్రాక్టీస్స్ చేసినప్పుడు వేరే వాళ్ళతో చేసి.. ఫైనల్ టేక్ మాత్రం కమల్ హాసన్ తో చేశారు. ఆ సమయంలో కమల్ హాసన్ చెంప మీద ఆమని గట్టిగా కొట్టాలి. కానీ తను భయపడుతూ సరిగ్గా చేయలేదట. దాంతో కమల్ హాసన్ నన్ను నిజంగా నువ్వు కొట్టడం లేదు కదా.. యాంక్టింగే కదా.. ఏం పర్లేదు కొట్టు అని చెప్పారట. దాంతో యాక్షన్ చెప్పగానే ఆమని కమల్ చెప్పినట్టుగానే చెంప మీద లాగిపెట్టి గట్టిగా కొట్టిందట. సింగిల్ టేక్ లో షాట్ ఓకే అయినప్పటికీ ఆమని చాలా గట్టిగా కొట్టిందట.

అప్పుడు కమల్ హాసన్, డైరెక్టర్ దగ్గరికి పిలిచి యాక్టింగ్ చేయాలని మరీ అలా నిజంగా కొట్టకూడదని చెప్పి మొత్తానికి సీన్ అనుకున్నట్టుగా వచ్చినందుకు ఆమనిని అభినందించారట. ఈ సినిమా తర్వాత ఆమని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా సూపర్ హిట్ సినిమాలలో నటించింది. అయితే తమిళ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత ఖాజా మొహియుద్దీన్ ను పెళ్ళి చేసుకొని సినిమాలకి దూరమయింది. కాగా, మళ్ళీ 2003లో రాంగోపాల్ వర్మ తీసిన మధ్యాహాన్నం హత్యతో ఆమని రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా సాగుతోంది. 

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago