K Viswanath : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దర్శక దిగ్గజం నేలకొరిగింది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కే.విశ్వనాథ్ గురువారం రాత్రి అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తరలించారు. కాశీనాధుని విశ్వనాధ్ గారు తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకులు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ప్రత్యేక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన గొప్ప వ్యక్తి, కె.విశ్వనాథ్ గారు. ఆయన లేని లోటు తీరనిది. గుంటూరు జిల్లా రేపల్లెలో 1930, ఫిబ్రవరి 19న జన్మించిన కె.విశ్వనాథ్. 50కి పైగా సినిమాలకు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన చివరి సినిమా శుభప్రదం.
1965లో ‘ఆత్మగౌరవం’ అనే సినిమాతో దర్శకుడిగా విశ్వనాథ్ అరంగేట్రం చేసారు కె.విశ్వనాథ్. సాగరసంగమం, శంకరాభరణం, స్వర్ణ కమలం, శుభసంకల్పం వంటి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే మరపురాని చిత్రాలుగా నిలిచాయి. అయితే ‘శంకరాభరణం’ సినిమా విడుదలై 43 ఏళ్లు పూర్తయిన రోజునే విశ్వనాథ్ మరణించడం యాదృశ్చికం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…