Gowri Pandit: సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఎంతో మంది యువతీ యువకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దేశం నలువైపుల నుండి ప్రతి ఏటా ఎంతోమంది హీరోయిన్లుగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది వరుస విజయాలతో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు పొంది ఇండస్ట్రీలో కొనసాగుతుంటే.. మరి కొంతమంది సరైన హిట్లు లేక ఒకటి రెండు సినిమాలతో ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు.
ఇంకొంత మంది హీరోయిన్లు మాత్రం హిట్ అందుకున్న కూడా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు.
అలా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లలో గౌరీ పండిట్ కూడా ఒకరు.
గోపీచంద్ హీరోగా నటించిన ఆంధ్రుడు సినిమాలో గౌరీ పండిట్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మంచి హిట్ అవటంతో హీరోయిన్ గా గౌరీ పండిట్ కి మంచి గుర్తింపు లభించింది. ఆ
సినిమా తర్వాత కూడా తెలుగులో కొన్ని సినిమాలలో నటించింది. ఇక 2012లో విడుదలైన హౌస్ ఫుల్ సినిమా తర్వాత గౌరీ పండిట్ సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. 2011లో బాలీవుడ్ నటుడు నిఖిల్ ద్వివేదిని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పింది. వీళ్లకు ఓ బాబు కూడా ఉన్నాడు. ఇక వివాహం తర్వాత వెంటనే బాబు పుట్టడంతో సినిమాలకు పూర్తిగా దూరమైన గౌరీ పండిట్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.
తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా గౌరీ పండిట్ తన కొడుకుతో తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పటికి ఇప్పటికీ గౌరీ పండిట్ ని పోల్చుకోవటం కష్టంగా మారింది. ఎందుకంటే అప్పటి కన్నా ఇప్పుడు మరింత అందంగా ఉంది. ఇప్పటికీ ఆమె ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇస్తే సెకండ్ హీరోయిన్ గా కూడా చాన్స్ అందుకోవడం గ్యారెంటీ అని అభిమానులు భావిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…