Featured

చిరంజీవి హిట్లర్ సినిమాకి డైలాగ్స్ రాయడం వల్లే ఎల్.బి.శ్రీరామ్ కెరీర్ దెబ్బతిందా ?

ఎల్. బి. శ్రీరామ్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ప్రముఖ నటుడుగా, రచయితగా, దర్శకుడుగా సుపరిచితుడు. మంచి కమెడియన్‌గా ఆయనకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఉన్న పేరు ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఎల్. బి. శ్రీరామ్ కెరీర్ నాటకాల ద్వారా ప్రారంభం అయింది. ముందు రంగస్థల నటుడిగా దేశవ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్ళు ఆలిండియా రేడియోలో పనిచేశారు. రచయితగా ఎన్నో రచనలు చేసిన ఎల్. బి. శ్రీరామ్.. రచయితగానూ చాలా పాపులర్ అయ్యారు. ఈ క్రమంలో 1983లో రచించిన ‘గజేంద్రమోక్షం’ నాటిక బాగా పాపులర్ అయింది. అంతేకాదు ఈ నాటిక కొన్ని వేలసార్లు ప్రదర్శించడం విశేషం.

ఇక ఎల్. బి. శ్రీరామ్ ‘కిష్కిందకాండ’ అనే సినిమా ద్వారా రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో ఆయన అపుడపుడు కొన్ని సినిమాలలో అతిథిగా, చిన్న పాత్రలు చేశారు. ఇక అక్కినేని నాగార్జున – సౌందర్య నటించిన హలో బ్రదర్ సినిమాకి డైలాగ్స్ రాశారు. ఈ సినిమాకి ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వం వహించారు. 1994లో వచ్చిన ఈ సినిమా భారీ హిట్ సాధించింది. కోటీ సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజికల్ గానూ మంచి హిట్ అయింది. దీనికి ముందు ఏప్రిల్ ఒకటి విడుదల, అప్పుల అప్పారావు సినిమాలకి డైలాగ్స్ రాశారు. ఈ రెండు సినిమాలలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించాడు.

ఒక సినిమాకి వంశీ దర్శకత్వం వహించగా ఒక సినిమాకి ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వం వహించారు. వీటితో ఎల్. బి. శ్రీరామ్ కి మాటల రచయితగా చాలా మంచి పేరొచ్చింది. దాంతో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి – రంభ జంటగా నటించిన హిట్లర్ సినిమాకి డైలాగ్స్ రాసే అవకాశం అందుకున్నారు. ఈ సినిమా 1997లో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాకి ముందు చిరంజీవి నటించిన సినిమాలు వరుసగా ఫ్లాపయ్యాయి.

హిట్లర్ తర్వాత ఎల్. బి. శ్రీరామ్ పెద్ద రచయితల లిస్ట్‌లో చేరిపోయారు. ముఖ్యంగా చిరంజీవి – రాజేంద్ర ప్రసాద్‌ల మేనరిజం బాగా వర్కౌట్ అయింది. ఆయన రాసిన కామెడీ ట్రాక్ అద్భుతంగా పండింది. అయితే ఈ సినిమా ఆయనకి శాపం అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అందుకు కారణం చిరంజీవి నటించిన హిట్లర్ సినిమాకి చాలా తక్కువగా డైలాగ్స్ చిరంజీవి క్యారెక్టర్ కి ఉండటమే. ఇది ఒకరకంగా ఆయనకి మైనస్ అయిందని అన్నారు. అంతేకాదు హిట్లర్ సినిమా తర్వాత ఎల్. బి. శ్రీరామ్ పెద్ద రచయిత అయ్యారని అందరూ చెప్పుకున్నారు. ఇక మనకి రాయరని సందేహాలు చిన్న సినిమాలు తీసేవారిలో కలిగి ఆయనని సినిమాలకి రాయమని అండగటం మానేశారట.

ఇది గొప్పగా చెప్పుకున్నప్పటికి హిట్లర్ సినిమా తర్వాత వస్తాయనుకున్న అవకాశాలు రాలేదు. అందుకే ఎప్పటికీ హిట్లర్ సినిమాను ఎల్. బి. శ్రీరామ్ గుర్తుపెట్టుకుంటారట. ఇక ముందు నుంచి ఇ.వి.వి. సత్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్ కి ఎల్. బి. శ్రీరామ్ కి మంచి అనుబంధం ఉంది. అందుకే రాజేంద్ర ప్రసాద్ ఆయనకి ఓ సినిమా అవకాశం కూడా ఇచ్చారు. ఇక చాలా బాగుంది సినిమా ద్వారా పల్లెటూరి యాసతో మాట్లాడే పాత్రతో మంచి నటుడిగానూ గుర్తింపు పొందారు. ఈ సినిమా తెచ్చిన క్రేజ్ తో సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. కమెడియన్ గానూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. సెంటిమెంట్ పాత్రకి ఎల్. బి. శ్రీరామ్ కొట్టిన పిండి. ప్రస్తుతం ఆయన సొంత యూట్యూబ్ ఛానల్‌లో మంచి కథలతో లఘు చిత్రాలను తీస్తున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago