Categories: FeaturedHealth News

మానసికంగా అలసిపోయారా..అయితే ఇలా చేయండి?

మనం మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం అని చెప్పవచ్చు. జీవితగమనంలో ఎన్నో సమస్యలు మనల్ని మానసికంగా వేధిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు, నిరుద్యోగం, ప్రమాదాలు, వృత్తిరీత్యా సమస్యలు ఇలా చాలా సమస్యలు మనల్ని మానసిక వేదనకు గురిచేస్తుంటాయి. ఎక్కువ రోజులు మానసిక వేదనకు గురి కావడం వల్ల ఖచ్చితంగా మన శరీర ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.పరిస్థితినే మానసికమైన అలసట అంటారు.

మానసిక వేదనకు గురైన వారు ఎప్పుడు చికాకుగా ఉంటూ అందరిపైనా గట్టిగా అరుస్తూ ఉంటారు. ఒంటరిగా ఉంటూ ఏ పని పైన ఉత్సాహం చూపించారు. ఆకలి ఎక్కువ లేదా తక్కువ ఉండడం, నిద్రలేమి వంటి సమస్యలతో నిత్యం సతమతమవుతుంటారు. ఒక్కోసారి ఆరోగ్యపరమైన సమస్యలు మానసికమైన అలసటకి దారితీస్తాయి.అలాంటి సమస్యలలో బాధపడేవారు భవిష్యత్తులో ప్రమాదకరమైన వ్యాధుల బారినపడే అవకాశాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

మానసిక ఒత్తిడిని జయించడానికి మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడం వల్ల మనసుని కూడా ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. దీనికోసం తక్కువ శారీరక శ్రమ కలిగిన ప్రాణాయామం, యోగా, మెడిటేషన్ వంటి వాటి ద్వారా మానసిక ప్రశాంతతను పొంది తద్వారా శారీరక ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇక వారానికి ఒకసారి మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి కాసేపు గడపడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. కొత్తవాటిని గురించి తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం చేయడం మంచిది. ప్రతిరోజు మనకి ఇష్టమైన సంగీతం వినడం, పుస్తకాన్ని చదవడం వంటివి చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. తద్వారా సంపూర్ణ శారీరక ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago