మనం మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం అని చెప్పవచ్చు. జీవితగమనంలో ఎన్నో సమస్యలు మనల్ని మానసికంగా వేధిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు, నిరుద్యోగం, ప్రమాదాలు, వృత్తిరీత్యా సమస్యలు ఇలా చాలా సమస్యలు మనల్ని మానసిక వేదనకు గురిచేస్తుంటాయి. ఎక్కువ రోజులు మానసిక వేదనకు గురి కావడం వల్ల ఖచ్చితంగా మన శరీర ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.పరిస్థితినే మానసికమైన అలసట అంటారు.

మానసిక వేదనకు గురైన వారు ఎప్పుడు చికాకుగా ఉంటూ అందరిపైనా గట్టిగా అరుస్తూ ఉంటారు. ఒంటరిగా ఉంటూ ఏ పని పైన ఉత్సాహం చూపించారు. ఆకలి ఎక్కువ లేదా తక్కువ ఉండడం, నిద్రలేమి వంటి సమస్యలతో నిత్యం సతమతమవుతుంటారు. ఒక్కోసారి ఆరోగ్యపరమైన సమస్యలు మానసికమైన అలసటకి దారితీస్తాయి.అలాంటి సమస్యలలో బాధపడేవారు భవిష్యత్తులో ప్రమాదకరమైన వ్యాధుల బారినపడే అవకాశాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
మానసిక ఒత్తిడిని జయించడానికి మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడం వల్ల మనసుని కూడా ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. దీనికోసం తక్కువ శారీరక శ్రమ కలిగిన ప్రాణాయామం, యోగా, మెడిటేషన్ వంటి వాటి ద్వారా మానసిక ప్రశాంతతను పొంది తద్వారా శారీరక ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇక వారానికి ఒకసారి మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి కాసేపు గడపడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. కొత్తవాటిని గురించి తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం చేయడం మంచిది. ప్రతిరోజు మనకి ఇష్టమైన సంగీతం వినడం, పుస్తకాన్ని చదవడం వంటివి చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. తద్వారా సంపూర్ణ శారీరక ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
































