అంతులేని కథ చిత్రాన్ని నిర్మించిన “ఆండాలు ప్రొడక్షన్స్” వారు ఆ సినిమా ఘన విజయం సాధించడంతో మళ్లీ బాలచందర్ తో ఓ చిత్రాన్ని నిర్మిద్ధామనుకున్నారు. ఆ క్రమంలో ఈసారి ఫ్యామిలీ సెంటిమెంట్ కాకుండా ఒక ప్రేమ కథ చిత్రం రూపొందించాలనుకున్నారు. అంతులేని కథ చిత్రానికి సంభాషణలు రాసిన ఆత్రేయను కాకుండా ఈసారి ఆయన స్థానంలో గణేష్ పాత్రోను తీసుకున్నారు. అంతులేని కథ సినిమాలో నటించిన కమల్ హాసన్ ని హీరోగా తీసుకుందామని ఆయనను సంప్రదించగా.. అప్పటికే ఆయన దర్శకరత్న దాసరి దర్శకత్వంలో కన్యాకుమారి చిత్రాన్ని ఒప్పుకొని షూటింగ్ కి సిద్ధంగా ఉన్నారు.
ఆ క్రమంలో తన గురువుగారైన బాలచందర్ ఓ ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నారని చెప్పడంతో దాసరి తను తీస్తున్న కన్యాకుమారి సినిమాని వాయిదా వేసుకొని కమల్ హాసన్ మరో చరిత్ర లో నటించడానికి అవకాశం కల్పించారు. హీరోయిన్ గా ముందుగా జయప్రదను అనుకున్నారు. కానీ అప్పటికే ఆమె తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత “అక్బర్ సలీమ్ అనార్కలి” హీరోయిన్ దీపను సంప్రదించారు. ఆమె కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఓ కొత్త హీరోయిన్ కొరకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలా దాదాపు ఎంతో మందిని ఆడిషన్స్ నిర్వహించగా చివరికి సరితను హీరోయిన్ గా తీసుకున్నారు. సరిత నల్లగా పొట్టిగా ఉన్న కూడా.. ఆమెలో ఉన్న చురుకుదనం చూసి బాలచందర్ ఈ సినిమాకి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.
ఆ తర్వాత ఈ సినిమాకి టైటిల్ ఏదైతే బాగుంటుందని దర్శక, రచయితలు ఆలోచించారు. అంతులేని ప్రేమ కథ, మరో ప్రేమకథ ఇలాంటి టైటిల్స్ పరిశీలనలో ఉండగా… చిత్ర నిర్మాత చరిత్రలో నిలిచిపోయే ప్రేమకథ కావున చరిత్ర అని అర్థం వచ్చే టైటిల్ వుండాలని ఈ సినిమాకి మరో చరిత్ర అనే టైటిల్ని చివరికి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ కొరకు విశాఖపట్నం, భీమునిపట్నం, అరకు లాంటి ప్రాంతాల్లో పర్యటించి చివరికి ఆ లొకేషన్స్ ని దర్శకనిర్మాతలు ఓకే చేశారు. అలా వారంతా విశాఖపట్నంలో అప్సర హోటల్ లో బసచేశారు. వీరు తమిళనాడుకు సంబంధించిన వారు కాబట్టి అక్కడివారిని వంట చేయడానికి ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. సినిమా మొత్తం ఎక్కువగా ఉదయం వీలైతే సాయంత్రం షూటింగ్ చేయడం జరిగింది.
1970 చివరి దశకంలో దాదాపు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కనుమరుగవుతున్న సమయంలో వచ్చిన ప్రేమ కథా చిత్రమే మరో చరిత్ర. 1978 మే 19న కళా దర్శకుడు బాలచందర్ మేధోమదనం నుంచి జాలువారిన మరో చరిత్ర విడుదలై ఎన్నో అద్భుతాలు సృష్టించింది. ఇదే సినిమాని డబ్బింగ్ చేయకుండా చెన్నైలో విడుదల చేస్తే ఏకంగా 500 రోజుల కంటే ఎక్కువగా ప్రదర్శింపబడింది. అలాగే హిందీలో లో కమల్ హీరో గా బాలచందర్ దర్శకత్వంలో “ఏక్ దూజే కే లియే” అనే సినిమాగా రీమేక్ కాబడి అద్భుత విజయాన్ని సాధించింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…