వివాదాస్పద వ్యాఖలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తి నటి శ్రీరెడ్డి, ఈ మధ్య ఫేస్బుక్ లో మంచి యాక్టీవ్ గా ఉంటోంది. ఎప్పడూ కూడా ఒక విషయం పై వివాదాస్పద వ్యాఖలు చేయడం ఆమెకి అలవాటే. అయితే ఇప్పుడు జనసేన ఏకైక ఎం.ఎల్.ఏ రాపాక వరప్రసాదరావు వంతు వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా, రాజోలు నియోజక వర్గం నుంచి గెలిచినా ఏకైక జనసేన ఎం.ఎల్.ఏ రాపాక.
వివరాల్లోకి వెళితే ఏపీ సీఎం వై.ఎస్ జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లు కి రాపాక మద్దతు తెపారు. బిల్లుని వ్యతిరేకించమని, ఒకవేళ ఓటింగ్ నిర్వహిస్తే బిల్లుకు వ్యతిరేకంగా ఓట్ వేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్, రాపాక వరప్రసాదరావు కు బహిరంగంగా లేఖ రాసిన సంగతి తెలిసిందే.. అయితే తన పార్టీ అధినేత లేఖను పట్టించుకోని రాపాక అసెంబ్లీలో బిల్లుకు మద్దతు తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని శ్రీరెడ్డి తన పేస్ బుక్ లో “రాపాక మీరు కేక” అంటూ పోస్ట్ చేసింది… ఇదివరకే పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన వ్యాఖలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు రాపాకను ప్రసంశిస్తూ పెట్టిన పోస్ట్ చేసింది. ఆల్రెడీ జనసేనాని విషయంలో శ్రీరెడ్డి పై కోపంతో ఊగిపోతున్న జనసైనికులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…