బాహుబలి, సాహో సినిమాలతో ఇండియన్ స్టార్ గా ఎదిగిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, సాహో సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ప్రభాస్ చాలానే గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవలే తిరిగి క్రొత్త సినిమా షూటింగ్ ను ప్రారంభించాడు. ఈ చిత్రానికి దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వ భాద్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కధానాయిక కాగా, యువి క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సాహో సినిమా సెట్స్ మీద ఉండగానే మొదలైన ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తీ చేసుకుంది. అయితే సాహో సినిమా తరువాత విదేశాలకు బ్రేక్ కోసం ప్రభాస్ వెళ్లిపోవడంతో షూటింగ్ ఆలస్యమైంది.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ శేరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం భారీ సెట్ వేశారు. ప్రభాస్ తో పాటు మరికొందరితో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. అయితే ఈ సినిమా ప్రారంభ సమయం నుంచి ఇది ఒక పీరియాడిక్ డ్రామా అనే ప్రచారం జరుగుతుంది. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమా రొమాంటిక్ డ్రామా మాత్రమే అని ట్విస్ట్ ఇచ్చి, ఇది పీరియాడిక్ డ్రామా కాదు అని స్పష్టం చేసాడు. ఈ సినిమాను 2021 సమ్మర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…