పంజాబీ కుటుంబ నేపథ్యం నుంచి స్టార్ హీరోయిన్ గా స్టార్ ప్రొడ్యూసర్ గా ఓ వెలుగు వెలుగుతోంది ఛార్మి. 13 ఏళ్ళకి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఓసారి ఛార్మీ తన అన్నయ్యతో వెళుతుంటే మోడల్ కో ఆర్డినేటర్ ఒకతను.. ఓ సినిమా షూటింగ్స్ కోసం కొంతమంది అమ్మాయిలను చూస్తున్నారు. ఒకసారి మీ చెల్లిని తీసుకువస్తే ఆడిషన్ చేసి సెలెక్ట్ అయితే సినిమాలలో అవకాశాలు వస్తాయి అని అన్నాడట. ఆమాట విన్న ఛార్మి అన్న మా ఫ్యామిలీలో ఇప్పటి వరకు సినిమాలలోకి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు అని ఆ కోర్డినేటర్ తో ఒకటే గొడవ పెట్టుకున్నాడట. అంతేకాదు ఇంటికెళ్ళాక కూడా దాదాపు ఓ వారం పాటు ఇదే టాపిక్ నడిచి చాలా డిస్కర్షన్స్ అయ్యాయట, ఆ కోర్డినేటర్ మళ్ళీ కూడా మీ అమ్మాయి తప్పకుండా సెలెక్ట్ అవుతుంది ఒక్కసారి పంపించండి అన్నాడట.
అన్న మాత్రం ససేమిరా అని చెప్పడంతో ఛార్మి తన అమ్మగారిని రిక్వెస్ట్ చేసింది. ఒక్కసారి ట్రై చేస్తాను. సెలెక్ట్ అవకపోతే మళ్ళీ సినిమా టాపిక్ మాట్లాడనని కన్విన్స్ చేయడంతో వాళ్ళ అమ్మగారు ఒప్పుకున్నారు. అలా ఛార్మి తన అమ్మని కన్విన్స్ చేసి 13 ఏళ్లకే ముంబై చేరుకుంది. ఓ స్టూడియోలో ఆడిషన్స్ నిర్వహిస్తునారు. తను వెళ్ళి చూడగానే అప్పటికే అక్కడ 5000 మంది అమ్మాయిలు ఉన్నారట. వాళ్ళని చూసి షాకయిన ఛార్మికి వెంటనే మరో షాక్ తగిలింది. అదే సమయంలో కార్వ్యాన్‌లో నుంచి స్టార్ హీరోయిన్ కరీన కపూర్ దిగింది. ఇది చూసి ఛార్మికీ ఏమర్థమవలేదు. తను వచ్చింది కరీనా సినిమాలో నటించడానికా అని షాకయిందట.
ఇక 10 మంది చొప్పున లైన్ లో అందరినీ నుంచోబెట్టి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తూ.. ఛార్మిని కూడా సెకెల్ట్ చేశారట. సెలెక్ట్ అన్నా కూడా ఇది నిజమా అబద్దమా అని కన్‌ఫ్యూజన్ లో పడింది చార్మి. ఇక తనని సెలెక్ట్ చేసింది ఓ జూనియర్ ఆర్టిస్ట్ గా అని తెలుసుకొని హ్యాపీగా ఫీలయింది. ఇక ఈ సినిమాలో హీరో ఎవరో తెలిసి నోట మాట రాలేదట. మైన్ ప్రేం కి దీవాని హో అనే సినిమా షూటింగ్.. పెద్ద సెట్.. హీరో హృతిక్ రోషన్.. హీరోయిన్ కరీనా కపూర్. ఇది నిజమా కలా అని కాసేపు అర్థం కాని పరిస్థితిలో ఉన్న ఛార్మి హృతిక్ ని చూడగానే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైందట.
అందుకు కారణం ఛార్మి ఫేవరేట్ హీరో హృతిక్ రోషన్. ఇక ఇందులో మరో హీరో అభిషేక్ బచ్చన్. ఇంత పెద్ద స్టార్స్ నటిస్తున్న సినిమాకి ఆడిషన్ కి రావడం, సెలెక్ట్ అవడం అంటే ఎంత అదృష్టం ఉండాలి. అదే ఛార్మి అనుకొని హ్యాపీగా ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ ఏజ్ లో షూటింగ్ అంటే తెలీదు, ఆడిషన్ అంటే తెలీదు, జూనియర్ ఆర్టిస్ట్ అంటే తెలీదు. అలా ముంబై వెళ్ళి ఈ సినిమాలో ఛాన్స్ అందుకుంది ఛార్మి. ఆరోజు తనకి ఇచ్చిన పేమెంట్ రూ.200. అంటే ఛార్మి సినిమాలలోకి వచ్చినప్పుడు తన మొదటి సంపాదన రూ.200 అనమాట.
ఇక ఈమె తెలుగులో హీరోయిన్‌గా నీతోడు కావాలి సినిమాతో పరిచయమయింది. ఇందులో హీరో దీపక్. మొదటి సినిమా అంతపెద్ద హిట్ అవకపోయినా కూడా తెలుగులో ఛార్మి వరుసగా అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్‌గా వెలిగింది. హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలో 15 ఏళ్ళకి పైగా నే ఉండి తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ సహా మరికొన్ని భాషలలో నటించి క్రేజీ స్టార్ గా మారింది. ప్రస్తుతం ఛార్మి సినిమాలలో నటించడం మానేసి నిర్మాతగా కొనసాగుతోంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ అనే బ్యానర్‌పై ఓ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాకి ఛార్మి ఒక నిర్మాత.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…