ప్రముఖ కన్నడ నటి జయంతి (76) కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె సోమవారం తెల్లవారు జామున బెంగళూరులోని ఆమె స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. నటి జయంతి 1963లో కన్నడలో ‘జెనుగూడు’ చిత్రంతో సినీ ప్రవేశం చేసారు..తెలుగు, కన్నడ, తమిళ, మళయాళం, హిందీ, మరాఠీ భాషల్లో కలిపి సుమారు 500కుపైగా చిత్రాల్లో జయంతి నటించారు.
తెలుగులో నటించిన పలు సినిమాలతో జయంతి తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేసారు. పెదరాయుడు సినిమాలో తన అద్బుతమైన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. వీటితో పాటు జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, శాంతి నివాసం వంటి చిత్రాల్లోనూ విభిన్న పాత్రలతో మెప్పించారు. తెలుగు హీరొయిన్ అయినప్పటికీ కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచుకుంది జయంతి. మిస్ లీలావతి చిత్రానికి గాను ఇందిరాగాంధీ చేతుల మీదుగా జాతీయ అవార్డు తీసుకున్నారు. జయంతి మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…