Featured

పూరి జగన్నాథ్ సూపర్‌ సినిమాలో ఛాన్స్ కోసం అనుష్కని ఎన్ని నెలలు వెయిట్ చేయించారో తెలుసా ?

టాలీవుడ్‌లో అనుష్క మోస్ట్ సీనియర్ హీరోయిన్..మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఇప్పటికే ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్.ఓ బ్రాండ్. సున్నితమైన మనస్తత్వం..గొప్పలు పోని అనుష్క శెట్టి..స్వీటీగా అందరి మనసులను దోచుకుంది. పేరుకు తగ్గట్టే స్వీటీ చాలా స్వీట్ పర్సన్ అని ఇండస్ట్రీలో ఆమెతో పనిచేసిన ప్రతీ ఒక్కరు చెబుతుంటారు. అనుష్క మాతృ భాష తుళు. అయినా తెలుగమ్మాయిలా చక్కగా, అందంగా కనిపిస్తుంది. అంతే అందంగా తెలుగులో మాట్లాడుతుంది. ఈమె సినిమాలలోకి రాకముందు యోగా శిక్షకురాలుగా పనిచేశారు. అప్పటి వరకు స్వీటీశెట్టిగా అందరూ పిలిచేవారు. సినిమాలలోకి వచ్చాక తన పేరు అనుష్కగా మారింది.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తనకి అనుష్క అని పేరుపెట్టింది ఎవరో అని అనుకుంటారు. కానీ ఆపేరు అనేది అనుష్కకి ఎవరు పెట్టలేదు. తనకి తనే ఈ పేరు పెట్టుకుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో వస్తుందని ఎవరూ అనుకోరు. అనుష్క కజిన్స్ అందరూ తనకంటే చాలా అందంగా ఉంటారట. అయినా వాళ్ళకి రాని అవకాశం అనుష్కకి ఎలా వచ్చింది అని ఇప్పటికి అర్థం కాదట. ఇక అనుష్క అమ్మగారు అన్నీ సినిమాలు చూస్తారట. ఒకవేళ సినిమా నచ్చితే చాలాసేపు మాట్లాడతారట. సినిమా గనక నచ్చకపోతే వెంటనే టాపిక్ మార్చేస్తారట. ఇక ఇప్పటివరకు అమ్మగారు అంతగా గొప్ప అప్రిషియేషన్స్ ఇచ్చింది లేదట.

ఇక అనుష్క చేసిన సినిమాలలో సూపర్, వేదం, రుద్రమదేవి, అరుంధతి, బిల్లా లాంటి సినిమాలు చాలా ఇష్టం అని చెప్పారు. అయితే సూపర్ అనుష్క సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ. ఇది తెలుగు డెబ్యూ మూవీ. యోగా టీచర్‌గా 6 ఏళ్ళు పనిచేశారు. అయితే సంపాదన వచ్చింది మాత్రం తక్కువ. కానీ ఫ్యాషన్ కాబట్టి చేసింది. అయితే తన తోటీ సన్నిహితుల ద్వారా పూరి జగన్నాథ్ పరిచయం అయి సూపర్ సినిమాలో అవకాశం అందుకుంది. అప్పటి వరకు పూరి జగన్నాథ్ సినిమాలు ఏవీ చూడలేదు. మొదట్లో చాలాసార్లు పూరి నుంచి ఎస్కేప్ అయింది. అందుకు కారణం ఆమెకి సినిమాల మీద పెద్దగా ఆసక్తి లేదట. దానివల్లే తను పూరి నుంచి తప్పించుకోవాలని చూసింది.

అయితే పూరి సినిమా అంటే కెరీర్ లో గొప్ప అవకాశం అని భూమిక భర్తతో పాటు మిగతా వాళ్ళు చెప్పారట. అలా సూపర్ సినిమా ఆడిషన్స్ కోసం హైదరాబాద్ వచ్చింది. ఆడిషన్స్ సమయంలోనే భయపడి వెళ్ళిపోవాలనుకుంది. ఫస్ట్ ఆడిషన్స్ లోనే తనకి ఏమీ తెలీదనే విషయం అర్థం చేసుకున్న నాగార్జున – పూరి జగన్నాథ్ తనని మానసికంగా సిద్దం చేసేందుకు దాదాపు 9 నెలలు అలా షూటింగ్ స్పాట్‌లో కూర్చో బెట్టారట. రోజూ ఓ అసిస్టెంట్ గా వచ్చి కూర్చునేదట. అలా 2005 మార్చ్ 12న మొదటిసారి కెమెరా ముందుకు వచ్చింది. ఇక మొదటి సినిమాలో గ్లామర్ రోల్ కాబట్టి పొట్టి పొట్టి బట్టలు వేసుకోవాల్సి వచ్చినప్పుడు బాగా ఏడ్చిందట. దాదాపు ఇలా సంవత్సరం పైనే ఇబ్బంది పడిందట. కానీ ఈరోజు అనుష్క ఓ స్టార్ .. ఈ స్టార్‌ని బీట్ చేయగలిగేవారు లేరు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాత్రి తలుపు మూసి నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?

రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…

10 minutes ago

పసుపు అరటి కాదు… ఎర్ర అరటి తింటేనే అసలు హెల్త్ సీక్రెట్!

మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…

8 hours ago

విశాఖలో విషాదం.. యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…

9 hours ago

ఫోన్‌తో టాయిలెట్‌లో గడిపితే… మీ శరీరం చెల్లించాల్సిన ధర ఇదే!

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…

9 hours ago

టాలీవుడ్‌కు ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ హాట్ టాపిక్

తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…

9 hours ago

కేరళ సీఎంకు లేఖ.. మోనాలిసా కేసులో కొత్త ట్విస్ట్

‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…

9 hours ago