బుల్లితెరపై ఒక యాంకర్ గా, డాన్సర్ గా, మెజీషియన్ గా, కమెడియన్ గా, టీమ్ లీడర్ గా చేసి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఏకైక ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా అంటే వెంటనే అందరికీ సుడిగాలి సుధీర్ గుర్తుకు వస్తాడు. ఒక సాధారణ ఆర్టిస్ట్ గా ఎంటరైన సుడిగాలి సుదీర్ ఆ తర్వాత తన టాలెంట్ తో వరుస అవకాశాలను దక్కించుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.
ప్రస్తుతం సుడిగాలి సుదీర్ ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్లు అందరూ తమదైన శైలిలో కామెడీలను పండిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఎపిసోడ్ కి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుదీర్ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.
శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి అతిథిగా వరుణ్ సందేశ్ వచ్చారు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ ఇందువదన అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో హీరో హీరోయిన్లు ఇద్దరూ నగ్నంగా హగ్ చేసుకోవడంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో ఈ పోస్టర్ లోని ఫోజ్ చూపించడంతో అందరూ నవ్వుకున్నారు. ఈ క్రమంలోనే ఆటో రాంప్రసాద్ మాట్లాడుతూ…”ఈ ఫోటోలో ఫోజ్ లో నిన్ను, శాంతి స్వరూప్ ను చూడాలని ఉంది” అని అడగగా.. రాంప్రసాద్ అడగగానే సుడిగాలి సుదీర్, శాంతిస్వరూప్ తో కలిసి ఈ ఫోటోలో ఉన్న ఫోజ్ ఇచ్చారు. అయితే సుడిగాలి సుదీర్ మాత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఉన్న విధంగా నగ్నంగా కాకుండా.. బట్టలతోనే ఈ ఫోజు ఇవ్వడంతో వేదికపై ఉన్న వారందరూ ఎంతో నవ్వుకున్నారు.
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…