Featured

హీరోయిన్ హీరాకు సెట్స్ లో ప్రేమలేఖలు రాసిన హీరో అజిత్.. ఆ తరువాత ఎందుకు వదిలేసాడు ?

తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీలో బాగా పేరు పొందిన హీరోగా అజిత్ పేరు తెచ్చుకున్నారు. ఈయన మొదట్లో బిగ్రేడ్ సినిమాల్లో నటిస్తూ ఆ తర్వాత ఒక్కొక్క మెట్టుగా ఎదిగి ప్రస్తుతం స్టార్ హీరోగా తమిళ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ మధ్య కాలంలో అజిత్ నటించే సినిమాలు భారతదేశంలోని వివిధ భాషలకు కూడా అనువదించడం ద్వారా ఆయన గురించి భారతదేశం మొత్తం తెలుసు. ఇకపోతే ఈయన సినీజీవితంలో ఎన్నో ప్రేమకథలు ఉండగా.. నిజజీవితంలో కూడా కొన్ని ప్రేమకథలు ఉన్నాయి. వాటి విషయానికొస్తే..

ప్రస్తుతం అజిత్ ఈ స్థాయిలో ఉండటానికి గల కారణం అప్పటి హీరోయిన్ హీరా అని ఎంతోమంది చెప్పేవారూ ఉన్నారు. నిజానికి అజిత్ మొదటి సినిమా ప్రేమ పుస్తకం.. ఆ తర్వాత ఆయన కొన్ని తమిళంలో బిగ్రేడ్ సినిమాల్లో నటించారు. ఆయన సినిమా మొదటి రోజుల్లో ఏబీఎన్ స్టూడియో లో జరుగుతున్న షూటింగ్ నేపథ్యంలో అక్కడ అజిత్ అప్పటికే టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరా తో అజిత్ కు పరిచయం ఏర్పడింది. సినిమా సెట్స్ లోనే హీరా రాజగోపాల్ కి లవ్ లెటర్స్ రాసేవాడు తలా అజిత్. అలా అతి తక్కువ సమయంలోనే వీరిద్దరు బాగా దగ్గరయ్యారు. దీంతో హీరో అజిత్ కోసం తన పలుకుబడిని ఉపయోగించి ఎంతో మంది దగ్గర ఆయనకు సినిమాలను ఇప్పించింది. ఆ సమయంలో టాప్ హీరోయిన్ గా ఉన్న హిరా ఒక పక్క టాప్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరో వైపు అజిత్ కోసం డేట్స్ సర్దుబాటు చేసుకొని మరి ఆయనతో నటించింది. దీంతో దర్శక నిర్మాతలు చూపు అందరూ అజిత్ పై ఉండేలా చేసింది నటి హీరా. నిజ జీవితంలో ఉన్న ప్రేమను రిల్ లైఫ్ లో కూడా బాగా పండించారు. ఆ రోజుల్లో హీరా అజిత్ తో కలిసి ఎంతటి బోల్డ్ సీన్స్ లో అయినా సరే నటించడానికి వెనుకాడేది కాదు. దీంతో వారిద్దరి మధ్య ఏదో ఉందని పెద్ద ఎత్తున గాసిప్స్ వచ్చాయి.

దీంతో హీరో అజిత్ ఏకంగా తాము ఏడాదిగా సహజీవనం కొనసాగిస్తున్నామని త్వరలో పెళ్లి చేసుకుంటున్నాము అని కూడా చెప్పేసాడు. ఆ రోజుల్లో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఆ సమయంలో హీరో అజిత్ కు మహిళా ఫాలోయింగ్ కూడా బాగా ఉండేది. అయితే ఏమైందో తెలియదు కానీ, కొద్ది రోజులకే వారిద్దరు ఎడమొహం పెడమొహం ఉండడం సినిమాల్లో ప్రజలు గమనించారు. ఇందుకు సంబంధించి అజిత్ ను అడగగా మా ఇద్దరికీ సరిపోలేదని అందుకనే మేం విడిపోయి అంటూ సంచలన ప్రకటన చేశాడు. ఆ తర్వాత మేమిద్దరం విడిపోవడానికి అసలు కారణం ఆవిడ డ్రగ్ అడిక్ట్ అని తెలిపాడు. అలాంటివారిని భరించడం నా వల్ల కాదు అనేసాడు దండం పెడుతూ. ఇకపోతే అజిత్ మాట్లాడిన విషయాలు హీరోయిన్ హీరా కు తెలిసి ఆవిడ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లి పోయింది. అసలు విషయాన్ని ఎప్పుడు మీడియాకు చెప్పడానికి ఇష్టపడలేదు.

అయితే ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత హీరో అజిత్ మరో హీరోయిన్ స్వాతి అనే ఆవిడ తో రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు హీరోయిన్ హీరా మాత్రం ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తాను అజిత్ తో మనస్పర్థలు వచ్చి విడిపోయాం అని అంతేకాకుండా దాని కోసం నా క్యారెక్టర్ మీద డ్రగ్ అడిక్ట్ అనే నింద మోపాల్సిన అవసరం లేదని ఆవిడ వాపోయింది. నా మనసుకు తెలుసు నాది ఎంత నిజమైన ప్రేమ అని. హీరో అజిత్ కు యాక్సిడెంట్ అయిన సమయంలో తన తల్లి తండ్రి కన్నా ఎక్కువగా తానే దగ్గరుండి సేవ చేశానని చెప్పుకొచ్చింది. చివరి నిమిషం వరకు మా ఇద్దరి రిలేషన్ కాపాడుకోవడానికి ఎంతగానో ప్రయత్నించానని, వదిలేసింది తాను కాదని అజిత్ తనను వదిలించుకున్నాడు అని తెలిపింది. ఆ తర్వాత ఆవిడ ఇంకా తనను ఏమీ అడగవద్దని అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొద్ది రోజులకు హీర మరొకరిని వివాహం చేసుకుంది. అయితే ఆ విషయాన్ని ఆవిడ కాస్త ఎవరికీ తెలియకుండానే ఉంచేసింది.

అలాగే 2007లో ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరో అజిత్ తో కలిసి సాగించిన ప్రేమాయణం జీవితాంతం మరచిపోలేనిది అభివర్ణించింది. ఇకపోతే అజిత్ హీరా తర్వాత స్వాతి అనే హీరోయిన్ తో ఎఫైర్ నడిపాడు. ఈసారి కూడా స్వాతి తాము ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ ప్రకటించింది. అలా చెప్పిన తర్వాత కొన్ని రోజులకి స్వాతి కూడా అజిత్ గురించి తన దగ్గర మాట్లాడవద్దు అని చెప్పే స్థాయికి చేరుకుంది. తాను ఇప్పుడు షాలిని తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు అని ఓ ఇంటర్వ్యూలో స్వాతి చెప్పుకొచ్చింది. అలా చెప్పింది కానీ వారిద్దరి వద్ద అసలు విషయాన్ని మాత్రం దాటేసింది. ఇలా అజిత్ చేతులు ఇద్దరు హీరోయిన్లు వారి జీవితాలలో ప్రేమ వైఫల్యం చవిచూశారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago