టాలీవుడ్‌లో ఉన్న ప్రముఖ దర్శక, రచయిత, నిర్మాతలలో పోసాని కృష్ణ మురళి ఒకరు. 100 సినిమాలకి పైగా సినిమాలు చేసిన ఆయన దగ్గర ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్స్, రైటర్స్ సహాయకులుగా పనిచేశారు. వారిలో దశరథ్, కొరటాల శివ లాంటి స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. కొరటాల శివ బీ.టెక్ చేశారు. ఆ తర్వాత ఓ ఉద్యోగం చేస్తూ సినిమాల మీద ఆసక్తితో వరుసకి బావ అయిన పోసాని కృష్ణ మురళి వద్ద సహాయకుడిగా చేరారు. కొంతకాలం రచనా విభాగంలో పనిచేసిన కొరటాల సోలో రైటర్‌గా మారారు.
గోపీచంద్ హీరోగా వచ్చిన ఒక్కడున్నాడు సినిమాకి మొదటిసారి డైలాగ్ రైటర్ గా పనిచేశారు. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కొరటాల ఆ తర్వాత డార్లింగ్ ప్రభాస్ హీరోగా వచ్చిన మున్నా సినిమాకి పనిచేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా నటించింది. సినిమా యావరేజ్ గా నిలిచినప్పటికీ డైలాగ్ రైటర్‌గా మాత్రం కొరటాలకి మంచి పేరు వచ్చింది. ఇదే క్రమంలో జూనియర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన బృందావనం, ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు.
ఈ సినిమాలతో కొరటాల పేరు టాలీవుడ్ లో బాగా వినిపించింది. దాంతో అందరూ ఇక ఆయన దర్శకుడిగా మారితే బావుంటుందని సలహాలిచ్చారు. ఇదే నేపథ్యంలో 2013లో ప్రభాస్ హీరోగా సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ సినిమానే మిర్చి. ఈ సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల శివ ప్రభాస్ ని చాలా కొత్తగా చూపించారు. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనే ఒకే ఒక్క డైలాగ్ ప్రభాస్ స్టామినాను చూపించింది. ఈ సినిమా భారీ హిట్ అందుకోవడంతో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు.
అయితే ఇలా మూడు బ్లాక్ బస్టర్స్ తీసిన కొరటాల శివ ఎందుకు ఆయన గురువు గారిని మర్చిపోయారని టాక్ మొదలైంది. పోసాని కృష్ణ మురళి దర్శకుడు, రచయిత, నిర్మాత మాత్రమే కాదు. గొప్ప నటుడు కూడా. ఆయన పోషించిన ప్రతీ పాత్ర ఎంతో పేరు తీసుకువచ్చింది. గత ఏడెనిమిదేళ్ళుగా పోసాని కృష్ణ మురళి చాలా బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. కొన్ని సినిమాలు చేసే సమయం లేక వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఇంత బిజీ ఆర్టిస్ట్ అయిన పోసానికి మూడు సినిమాలలో ఒక్క అవకాశం కూడా కొరటాల ఇవ్వలేదని, ఆయనకి కృతజ్ఞత లేదని కామెంట్స్ వినిపించాయి.
దాంతో ఒక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఆయనకి ఎదురైంది. ఈ ప్రశ్నకి కొరటాల స్పందిస్తూ.. నేను చేసిన మూడు సినిమాలలో పోసాని గారికి సరిపడే క్యారెక్టర్ లేదని.. ఆయనని చిన్న చిన్న పాత్రల్లో చూడాలనుకోవడం లేదని వెల్లడించారు. ఆ స్కోప్ లేకనే మా గురువుగారికి నా సినిమాలలో వేషం ఇవ్వలేకపోయానని.. తప్పకుండా ఆయనకి ఓ గొప్ప పాత్ర రాస్తానని చెప్పారు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన నాలుగవ సినిమా భరత్ అనే నేను సినిమాలో మంచి రోల్ ఇచ్చారు. ఈ పాత్ర పోసానికి చాలా మంచి పేరు తీసుకువచ్చింది. ఇక కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ ఆచార్య తెరకెక్కిస్తున్నారు.
మహాశివరాత్రి వేళ భక్తుల రద్దీతో కళకళలాడిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం మరోసారి విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.…
పండ్లలో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది బొప్పాయి. సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండే ఈ…
చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…
2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…
అంతరిక్ష రంగంలో కెరీర్ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…