కాంట్రవర్సి కి కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ అన్న విషయం సోషల్ మీడియాను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. డిఫరెంట్ మెంటాలిటీ. నెగిటివ్ థింకింగ్, స్ట్రైట్ ఫార్వర్డ్ నెస్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వెరైటీ ఆటిట్యూడ్, అంతకుమించిన గట్స్ వర్మ సొంతం. బహుశా వర్మలా జీవించే వాడు ప్రపంచంలో అయన ఒక్కడేనేమో.. ఇక మన దేశంలో అయితే ఖచ్చితంగా ఎవరూ ఉండి ఉండరు..
మనుషులందరూ ఒక వైపు, నేను ఒక్కడిని ఒక వైపు అనే డైలాగ్ రాంగోపాల్ వర్మ కి కరెక్ట్ గా సూట్ అవుతుంది. తను అనుకున్నది అనుకున్నట్లుగా తన మాటలను ప్రజల్లోకి వాడులుతుంటాడు రామ్ గోపాల్ వర్మ. సినీ పరిశ్రమలో ఉంటూనే హీరోలతోనే గొడవలు.. వాళ్ళ వ్యక్తిగత విషయాలలో కూడా వేలు పెడతాడు. అంతేకాదు రాజకీయనాయకులను కూడా వదలడు.. అసలు వర్మ తత్త్వం, సిద్ధాంతం ఎవరికీ అర్ధం కావు. ఒక పక్క దేవుడు లేడు అంటాడు. బంధాలు, పాప పుణ్యాలు అన్నీ ట్రాష్ అంటాడు. ఇక వర్మ చావుకు కూడా బయపడరట. చావు ఎప్పటికైనా తప్పదు కాబట్టి, ఎప్పుడు చచ్చిపోతామేమో అనుకుంటూ భయపడుతూ బ్రతకడం నాకు నచ్చదని చెబుతాడు వర్మ. అలాగే తన చావు ఎలా ఉండాలో కూడా ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాడట.
చావుకి కొంచెం ముందుగా అణుబాంబ్ పేలుడును దగ్గరగా చూడాలన్నది వర్మ కోరిక అట. ఇక ఆ సమయంలో తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం లేకుండా.. బాంబు పేలుడును చూసి చనిపోతాడట. ఇప్పటికే జీవితంలో అన్నీ చూసేసిన వర్మకు నిజమైన అణుబాంబు పేలుడు చూస్తూ మరణించాలనేది ఆఖరి కోరిక అట. చావులో కూడా వర్మ తన డిఫరెంట్ మెంటాలిటీ ని చూపించాడు కదా..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…