దేశ వ్యాప్తంగా ఎన్నో సినిమా పరిశ్రమలున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, బాలీవుడ్ సహా పలు రకాల ఇండస్ట్రీలున్నాయి. ఏ భాషలోనైనా సినిమా హిట్ అయితే.. దాన్ని మరో సినిమాలో డబ్బింగ్ చేయడమో.. లేదంటే రీమేక్ చేయడమో చేస్తుంటారు. నిత్యం పలు భాషల చిత్రాలు ఇతర భాషల్లోకి డబ్బింగ్ అవుతూనే ఉన్నాయి. ఈ ఆనవాయితీ ఎన్నో ఏండ్లుగా కొనసాగుతుంది. హిందీ, తమిళ, మలయాళం, కన్నడ సహా పలు భాషల చిత్రాలను తెలుగు జనాలు ఆదరిస్తూనే ఉన్నారు. వాటిలో నటించి హీరో, హీరోయిన్లు ఇక్కడి వారినీ బాగా ఆకట్టుకున్నారు కూడా. అయితే తెలుగులో డబ్బింగ్ ఎప్పుడు మొదలైంది? తెలుగులో డబ్ అయిన తొలి సినిమా ఏంటి? అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1931లో వెండి తెరపై తొలిసారి తెలుగు మాటలు వినిపించాయి. అంతకు ముందే తెలుగు సినిమా పరిశ్రమ ఏర్పడినా మూకీ మూవీసే వచ్చాయి. మూకీ సినిమా టాకీగా మారింది మాత్రం 1931లోనే. ఇదే సమయంలో డబ్బింగ్ సినిమాలు మొదలయ్యాయి. 1950 నుంచి తెలుగులో డబ్బింగ్ సినిమాలు రావడం మొదలు పెట్టాయి. తెలుగులో వచ్చిన తొలి డబ్బింగ్ మూవీ ఆహుతి. బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన నీరా ఔర్ నందా సినిమాకు డబ్బింగ్ ఈ సినిమా.
ఈ సినిమాలో జయసింహ, రూప్ బసంత్, శశి, నిశి బరన్ సహా పలువురు తారలు నటించారు. ఆర్.ఎస్. జున్నాకర్ డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది. హిందీలో పి.శంకర్ స్వరాలు సమకూర్చాడు. తెలుగులో సాలూరి రాజేశ్వరరావు ఈ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సినిమాతోనే తెలుగు మహాకవి శ్రీశ్రీ వెండితెరకు ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఈ సినిమాకు మాటలు, పాటలు రాసి సినిమా రంగాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఈ సినిమాను నవీనా ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులోకి డబ్ అయ్యింది. ఇక్కడ కూడా మంచి విజయం సాధించడంతో తెలుగులోకి డబ్బింగ్ సినిమాల రాక మొదలయ్యింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…