బుల్లితెరపై పలు సీరియల్స్ లో హీరోయిన్ గా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వారిలో చైత్ర రాయ్ ఒకరు.అష్టా చమ్మా అలామొదలైంది వంటి సీరియల్స్ ద్వారా హీరోయిన్ గా పరిచయమైన చైత్రకు తెలుగులో మంచి అవకాశాలు లభించాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సీరియల్ తో ఎంతో బిజీగా ఉన్న చైత్ర ఉన్నఫలంగా సీరియల్స్ కి విరామం ఇచ్చారు. అయితే బుల్లితెరకు గుడ్ బాయ్ కాకుండా కేవలం విరామం మాత్రమే అని చెప్పిన చైత్ర తాజాగా అసలు విషయాన్ని బయటపెట్టారు.
గత కొంత కాలం నుంచి సీరియల్స్ కి దూరంగా ఉన్న చైత్ర తాజాగా తన అభిమానులకు ఒక శుభవార్తను తెలియజేశారు. చైత్ర తన భర్త ప్రసన్న ఇద్దరు కలిసి ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. తమ జీవితం కొత్త ఆరంభం కాబోతుందని చెబుతూ తాను త్వరలోనే తల్లి కాబోతున్నానే విషయాన్ని తెలుపుతూ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంది.
ఈ క్రమంలోనే చైత్ర పోస్ట్ చేస్తూ జీవితంలో మనం ఎప్పుడైనా సందిగ్దంలో ఉంటే అప్పుడు పిల్లలను ఎంచుకోండి. కెరియర్ పని సెలెక్ట్ చేయడం కోసం జీవితంలో చాలా సమయం ఉంది.ఫ్యామిలీ అనేది మనకు కేవలం ముఖ్యమైనది మాత్రమే కాదు అదే మన సర్వస్వం అంటూ.. త్వరలోనే బేబీ చైత్ర రాయ్ రాబోతుంది అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు.
ఈ విషయాన్ని తన భర్తతో కలిసి మాతో పంచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని.. మాకు మీ ప్రేమ ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మా జీవితంలోకి రాబోతున్న కొత్త దశను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుపుతూ తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…