Featured

త్రిమూర్తుల పేర్లతో వచ్చిన ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడాయో చూడండి..!!

కర్త, కర్మ, క్రియ అని చెప్పుకునే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరలనే మనం త్రిమూర్తులుగా పిలుస్తాం. పురాణాల ప్రకారం ఈ ముగ్గురు లేనిదే మానవ జన్మ లేదని చెబుతారు. భారతం, భాగవతం, రామాయణం లను ఆధారంగా చేసుకొని తెలుగు సినిమాలు వచ్చాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఈ ముగ్గురు పేర్లతో సినిమాలు వచ్చాయి అంటే అతిశయోక్తి కాదు.

త్రిమూర్తులలో మొదటివాడు బ్రహ్మ.. బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ వంటి విజయవంతమైన సినిమాల అనంతరం బి.గోపాల్ మంచి స్వింగ్ లో ఉన్నారు.

1992 లో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లో బి.గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు, శిల్పా శిరోద్కర్ హీరో, హీరోయిన్లుగా “బ్రహ్మ” అనే సినిమా విడుదల అయ్యింది. అసెంబ్లీ రౌడీ తర్వాత మోహన్ బాబు బి.గోపాల్ కాంబినేషన్లో సినిమా అనగానే ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.

ఇకపోతే త్రిమూర్తులలో రెండోవాడు విష్ణు, 2003 లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లో షాజికైలాస్ దర్శకత్వంలో “విష్ణు” సినిమా విడుదలయ్యింది. ఇందులో మంచువిష్ణు, శిల్ప ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నప్పటికీ బాక్సాఫీసు వద్ద తిరోగమనం పట్టింది.

ఆ తరువాత త్రిమూర్తులలో చివరివాడైన శివుడు. 1989 అన్నపూర్ణ బ్యానర్ లో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో శివ చిత్రం విడుదలైంది. దర్శకత్వంలో పూర్వఅనుభవం లేని రాంగోపాల్ వర్మను ఎవరు కూడా నమ్మలేదు. విడుదల వరకు శివ చిత్రం మీద ఎలాంటి అంచనాలు పెట్టుకొని సాంకేతికవర్గం. కానీ అక్కినేని నాగార్జున మాత్రమే రాంగోపాల్ వర్మను నమ్మాడు మిగతా వారంతా అతనిని ఎవరు కూడా విశ్వసించే లేకపోయారు. కానీ తెలుగు పరిశ్రమ శివకు ముందు శివ తర్వాత అనే పరిస్థితి వచ్చిందంటే, శివ చిత్రం ఎలా విజయవంతం అయిందో దీన్ని బట్టి అర్థం అవుతుంది. తెలుగు చిత్ర గమనాన్ని మార్చిన దర్శకుడిగా రాంగోపాల్ వర్మ ఉండిపోతారు. అయితే 1989 అక్టోబర్లో విడుదలైన శివ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయదుందుభి మోగించింది.

అలా త్రిమూర్తుల పేర్లతో వచ్చిన బ్రహ్మ, విష్ణు, శివ అనే చిత్రాల్లో ఒక శివ చిత్రం మాత్రమే ఘన విజయం సాధించడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago