Featured

‘ఓయ్’ సినిమా ఫ్లాపవడానికి కారణం హీరోయిన్ లేక దర్శకుడా..?

కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదల అవుతాయి. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంటాయి. కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలవుతాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చి నెమ్మదిగా థియేటర్స్ పెరిగి హిట్ సాధిస్తుంటాయి. ఏ సినిమాకైనా పబ్లిసిటీ ఎంత ముఖ్యమో, సినిమా హిట్ లేదా ఫ్లాప్ అనే వాటికి మౌత్ టాక్ ముఖ్యం. వాళ్ళు ఇచ్చే రిపోట్ మాత్రమే సినిమా సక్సెస్ ని డిసైడ్ చేస్తుంది. జనాలు నచ్చని, మెచ్చని సినిమా కాసుల వర్షం కురిపించింది ఏదీ లేదు. కథ, కథనం తయారు చేసుకునేటప్పుడు దర్శక, రచయితలకి అద్భుతంగా అనిపిస్తుంది.

అది విన్న హీరో, హీరోయిన్.. నిర్మాత బ్లాక్ బస్టర్ అని గట్టిగా ఫిక్స్ అవుతారు. మంచి లొకేషన్స్..కథకి సరిపోయే హీరో, హీరోయిన్ వాళ్ళకి తగ్గ బడ్జెట్ పెట్టి సినిమా నిర్మించే నిర్మాత. సినిమాకి అత్యంత ప్రధానమైన భాగం సంగీతం. కథకి ఎలాంటి సంగీతం కావాలి.. ఎలాంటి నేపథ్య సంగీతం ఉండాలి..దీనికి సరైన సంగీత దర్శకుడు ఎవరు..ఇలా అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకొని సినిమాను తీసి..భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించి అంతే భారీ స్థాయిలో రిలీజ్ చేస్తారు. కానీ ఎక్కడో ఏదో పాయింట్ ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో మేకర్స్ సినిమా మీద పెట్టుకున్న అంచనాలు, ఆశలు ఆవిరైపోతారు. ఒకవేళ ఇది డెబ్యూ డైరెక్టర్ మూవీ అయితే మళ్ళీ ఆ డైరెక్టర్‌కి సినిమా రావడం గగనమే.

అలాంటి పరిణామాలే ఓయ్ సినిమా విషయంలో కూడా జరిగాయి. బొమ్మరిల్లు తర్వాత సౌత్ మొత్తంలో స్టార్ హీరోగా సిద్దార్థ్‌కి అసాధారణమైన క్రేజ్ అండ్ పాపులారిటీ వచ్చింది. ఆయన హీరోగా, షామిలీ హీరోయిన్‌గా పరిచయం అవుతుందంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం. డెబ్యూ డైరెక్టర్ ఆనంద్ రంగా కథ కథనం. ప్రముఖ నిర్మాత డీవీ దానయ్య యూనివర్సల్ మీడియా సంస్థలో నిర్మాణం. సినిమాలో సిద్దార్థ్ క్లాసీ లుక్ విపరీతంగా ఆకట్టుకుంది.

ఓయ్ సినిమా రిలీజ్‌కి ముందే ఆడియో పెద్ద హిట్. సినిమా రిలీజయ్యాక కూడా ప్రతీ సాంగ్ చాలా ఆకట్టుకుంది. సాంగ్స్ పరంగా మూవీ భారీ హిట్ అని టాక్ తెచ్చుకుంది. కథ కథనం అంతా పర్‌ఫెక్ట్ గా కుదిరింది. ఓ సాంగ్ సిద్దార్థ్ పాడాడు. ఓ పాటను మ్యూజిక్ డైరెక్టర్ సిద్దార్థ్ పాడాడు. మిగతా పాటలను శ్రేయ ఘోషాల్, సునిధి చౌహాన్, శ్వేతా పండిట్, కె కె, ప్రియ హిమేష్ లాంటి పాపులర్ సింగర్స్ పాడారు. కానీ సినిమాలో ఏదో మిస్సింగ్. అదే హీరోయిన్ శామిలీ పర్ఫార్మెన్స్. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆకట్టుకున్న ఈమె హీరోయిన్ ఎంట్రీ అంటే ప్రేక్షకులు ఎంతో ఊహించుకున్నారు.

కానీ వారి ఊహలన్నీ తారుమారయ్యాయి. కథ నేపథ్యం ప్రకారం హీరోయిన్ క్లైమాక్స్ లో చాలా డీ గ్లామర్ గా హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవాలి. కానీ శామిలీ ఈ విషయంలో మైనస్ అయింది. క్లైమాక్స్ చూసిన ఎవరికైనా నాగార్జున నటించిన గీతాంజలి సినిమా గుర్తొస్తుంది. దాదాపు చాలామంది ఆ సినిమా క్లైమాక్స్ తో కంపేర్ చేసుకున్నారు. దాంతో ఇది మరో పెద్ద మైనస్ అయింది. ఇక దర్శకుడు క్లైమాక్స్ తీయడంలో తడబడ్డాడు. సరైన ముగింపు లేకపోవడం హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకోకపోవడంతో భారీ అంచనలా మధ్య వచ్చిన ఓయ్ సినిమా ఫ్లాప్ గా మిగిలింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago