Featured

నిత్యా మీనన్ నటిగా ఎలా మారింది.. ఎవరు ఆఫర్ చేశారో తెలుసా..?

టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండాస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్‌లో నిత్యా మీనన్ ఒకరు. తెలుగులో బి వి నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అలా మొదలైంది’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించాడు. ఈ సినిమాను కె. ఎల్. దామోదర ప్రసాద్ శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై నిర్మించాడు. దర్శకురాలు నందినీ రెడ్డికి ఈ సినిమా మొదటిది. 2011లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నేచురల్ స్టార్‌గా నానికి ఎలాంటి పేరుందో అలా మొదటి సినిమాతోనే నిత్యా మీనన్ నేచురల్ పర్ఫార్మర్ అని పేరు తెచ్చుకుంది.

అంతేకాదు నిత్యా మీనన్ మొదటి సినిమాలోనే హీరోయిన్‌గా కాకుండా తనలో ఉన్న మరో టాలెంట్‌ని బయటకి చూపించింది. అదే తనలో ఉన్న సింగర్. అలా మొదలైంది సినిమాలో ‘ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే’, ‘అబ్బబ్బో.. అబ్బో’.. అనే రెండు పాటలు పాడిన నిత్యాకి ఈ రెండు పాటలు సూపర్ హిట్ అయి ఒకే సినిమాతో హీరోయిన్‌గా, సింగర్‌గా పేరు తెచ్చుకుంది. అప్పటి నుంచి తెలుగు సినిమాలతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో నటిస్తూ, మధ్యలో సాంగ్స్ పాడుతూ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది.

అంతేకాదు నిత్యా మీనన్ అంత ఈజీగా ఓ పాత్రను ఒప్పుకోదనే టాక్ ఉంది. ముందు కథ ఆమెకి బాగా నచ్చాలి. ఆ తర్వాత కథలో తనపాత్రకి ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది చాలా ఖచ్చితంగా చూసుకుంటుంది. అంతే తప్ప ఈ సినిమా చేస్తే డబ్బు వస్తుంది కదా అని మాత్రం పొరపాటున ఒప్పుకోదు. రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తామని నిర్మాతలు ఆఫర్ చేసినా కూడా నిత్యా మీనన్ కథ నచ్చక వదిలేసిన సినిమాలు చాలా ఉన్నాయి. అయితే నిత్యా మీనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వక ముందే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఓ సినిమాలో చేసింది. ఇందులో అవకాశం రావడం చాలా విచిత్రంగా జరిగిందని ..అసలు మేము ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే చైల్డ్ ఆర్టిస్ట్‌గా అవకాశం వచ్చిందని నిత్యా చెప్పారు.

తను స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు ఓరోజు కాల్ వచ్చిందట. ఫ్రెంచ్ ఆక్సెంట్‌లో సినిమాలో నటిస్తారా..ఓసారి ఆడిషన్‌కి రమ్మని చెప్పారట. అయితే అలా నిత్యాకి కాల్ రావడానికి
కారణం వాళ్ళకి బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఇంట్లో నిత్యా ఫొటో చూసి ఇది బావుంది నేను తీసుకుంటానని తన ఫొటో ఒకటి తీసుకున్నారట. ఆయన ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేస్తారు. అలా నిత్య ఫొటో ఓ సినిమా టీమ్మ్ చూసి కాల్ చేశారు. సరే వచ్చిన అవకాశాన్ని కాదనడం ఎందుకని అన్నీ కండీషన్స్ ముందే చెప్పి ఆడిషన్స్‌కి వెళ్ళారట.


ఆ సమయంలో నిత్యా ఏక్ 7 – 8 ఏళ్లు. ఒక సీన్ పేపర్ ఇచ్చి డైరెక్టర్ ఇది చది గుర్తుపెట్టుకొని చెప్పగలవా అని అడిగారట. ఓకే అన్న నిత్యా చక చకా సీన్ పేపర్ తీసుకొని ఆ డైలాగ్ మొత్తం బట్టి పట్టీ టక టకా చెప్పేసిందట. నితూఅ స్పీడ్‌కి తన మెమరీకి డైరెక్టర్‌తో సహా అందరూ షాకయి వెంటనే తన డ్రెస్ అండ్ షూ మెజర్‌మెంట్స్ తీసుకొని ఫైనల్ చేశారట. అది ఇంగ్లీష్ మూవీ. ఇందులో టబుకు చెల్లిగా నటించింది. అలా మొదటి సినిమాలో అవకాశం వచ్చింది. తను ఏదో అవ్వాలనుకుంటే ఫైనల్‌గా హీరోయిన్ అండ్ సింగర్ అయింది. ఇక ఓ సాంగ్‌కి కూడా నిత్యా మీనన్ డాన్స్ కొరియేగ్రఫీ కూడా చేసింది. రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది. ఎక్కడ సినిమా చేసినా నిత్యా మీనన్ ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంటుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago