సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని చాలా మంది భావిస్తారు. ఇండస్ట్రీలోకి వచ్చిన ఏ అమ్మాయికైనా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణల ఎదుర్కోవాల్సిందే. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే, అవకాశాలు రావాలంటే తప్పనిసరిగా ఇలాంటి ఆరోపణలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎంతో మంది సినీ తారలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ మహిళలకు లైంగిక వేధింపులు తప్పవని, ఎంతో మంది డైరెక్టర్లు నిర్మాతలు మహిళలను బలవంత పెడుతూ ఉంటారని ఇప్పటికే చాలా మంది తారలు తెలిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.తాజాగా ఈ కాస్టింగ్ కౌచ్ విషయంపై నటి మాహికా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎంటర్టెన్మెంట్ రంగంలో హీరోయిన్స్ ఎప్పుడు కూడా దర్శక నిర్మాతలు ఒక లైంగిక వస్తువుగానే చూస్తారని నటి ఆరోపించారు. ఈ విషయంలో కొందరు దర్శక నిర్మాతలు బలవంతం చేస్తే మరికొందరు అవకాశాలను ఎరగా వేసి లోబర్చుకుంటారని తెలిపారు. ఇండస్ట్రీలో పనిచేసే హీరోయిన్స్ కు ఒకటి కావాలంటే.. మరొకటి త్యాగం చేయాల్సిందేనని మహికా శర్మ పేర్కొన్నారు.
ఇక ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన అమ్మాయిల గురించి చెప్పాల్సిన పని లేదు. వారు ఎంతో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటారని, ఈ సమాజం కూడా సినిమా ఇండస్ట్రీని చూసే విధానం వేరుగా ఉంటుంది. ఇండస్ట్రీలో పని చేసే హీరోయిన్లు అంటే హై ప్రొఫైల్ ఉన్న వేశ్యలుగానే చూస్తారే తప్ప.. వారికి ఎలాంటి గౌరవం ఉండదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…