ప్రముఖ దర్శకులు కె బాలచందర్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన గొప్ప నటుడు ప్రకాశ్ రాజ్. రంగస్థలం నుంచి సినిమాలలోకి వచ్చిన ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషిస్తున్నారు. కేవలం విలక్షణ పాత్రలలోనే కాకుండా హీరోగా, దర్శక, నిర్మాతగాను రాణిస్తున్నారు. సామాజిక సేవలో కూడా ప్రకాశ్ రాజ్ తన వంతు బాధ్యతను నిర్వహిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ ని మించిన నటుడు మరొకరు ఉండరనే స్థాయిలో ప్రేక్షకులు చెప్పుకునేలా తను కమిటయిన పాత్రలకి ప్రాణం పోస్తున్నారు. ఒక్క సినిమాలో పాత్ర హైలెట్ అయింది అని కాకుండా ఏ సినిమాలో పాత్ర ఆ పాత్ర హైలెట్ అవ్వాల్సిందే. బొమ్మరిల్లు, పరుగు, ఒక్కడు, చూడాలని ఉంది లాంటి సినిమాలలో ఆయన నటన అద్భుతం.
నువ్వే నువ్వే, అతడు, జల్సా లాంటి సినిమాలు ప్రకాశ్ రాజ్ సత్తా ఏంటో చూపించాయి. బద్రి, పోకిరి, ఇడియట్, అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి, మున్నా లాంటి సినిమాలలో ఆయన చేసిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇండస్ట్రీలో చిన్న హీరోల దగ్గర్నుంచి స్టార్ హీరోల వరకు ఎవరి సినిమా మొదలైనా ప్రకాశ్ రాజ్ కోసం ఓ పాత్ర రాయాల్సిందే. అంతేకాదు కొన్ని సినిమాలల్లో ప్రకాశ్ రాజ్ ఉండకపోతే ఆ సినిమాను తీయొద్దలే అనుకున్న నిర్మాతలు ఉన్నారు. అందుకు ఉదాహరణ పరుగు సినిమా. ఈ సినిమా కథను దిల్ రాజు.. మరో ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజుకి చెప్పారు.
కథ మొత్తం విన్న ఎం.ఎస్.రాజు విత్ అవుట్ ప్రకాశ్ రాజ్ నువ్వు ఈ సినిమా చేయొద్దు అని చాలా స్ట్రాంగ్‌గా చెప్పారట. అంటే ఆ పాత్ర కి ఎవరైనా సూటవుతారు. కానీ ఆయన చేస్తేనే వెయిట్ ఉంటుంది. అదే ఎం.ఎస్.రాజు దిల్ రాజుకి చెప్పారు. ఇలాంటి సందర్భాలెన్నో జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా తన సినిమాలలో ప్రకాశ్ రాజ్ కి క్యారెక్టర్ ఉండాలని దర్శక, నిర్మాతలకి సూచించిన సందర్భాలు ఎన్నో. అలా ఆయన నటించిన సినిమాలే కాదు మెగా ఫ్యామిలీ హీరోలు నటించిన చాలా సినిమాలలో పాత్రలకి ప్రకాశ్ రాజ్‌ని తీసుకున్న సందర్భాలున్నాయి. అయితే ఇక్కడ ఎప్పుడు ఒకరిదే అగ్ర స్థానం ఉండదు. కొంతకాలానికి అదే నటుడికి పోటీగా మరొకరు వస్తారు..రాకతప్పదు.
ఆ విధంగా ఇప్పుడు ప్రకాశ్ రాజ్ కి పోటీగా తమిళ నటులు వచ్చారు. వారే సముద్రఖని, విజయ్ సేతుపతి. వీరిద్దరు ఇప్పుడు సౌత్ సినిమాలలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషిస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాతో మెగా ఫ్యాన్స్ ని, మెగా ఫ్యామిలీని బాగా ఆకట్టుకున్నాడు. ఇండస్ట్రీ వర్గాలలో కూడా విజయ్ సేతుపతి మీద బాగా ఫోకస్ ఎక్కువైంది. చాలా సినిమాలకి విజయ్ సేతుపతి పేరును పరిశీలిస్తున్నారు. కానీ దాదాపు రెండేళ్ళకి పైగానే ఆయన డైరీ నిండిపోయింది. అందుకే ప్రతీ సినిమాను ఒప్పుకోవడం లేదు.
ఇక మరో నటుడు సముద్రఖని కూడా బాగా ఈ మధ్యకాలంలో పాపులారిటీని తెచ్చుకున్నారు. క్రాక్ సినిమా తర్వాత ఆయనకి బాగా సౌత్ లో క్రేజ్ పెరిగింది. రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే కాదు మరికొన్ని టాలీవుడ్ సినిమాలలో కూడా సముద్రఖని ఎంపికయ్యాడు. వాస్తవంగా వీటిలో కొన్ని పాత్రలు ప్రకాశ్ రాజ్‌తో చేయాలనుకున్నవని సమాచారం. కానీ ఇప్పుడు కొన్నిటికి బెటర్ ఆప్షన్‌గా ప్రకాశ్ బదులు సముద్రఖని కనిపిస్తున్నారు. అందుకే ఆయన చేయాల్సిన రోల్స్ కొన్ని సముద్రఖని దక్కించుకుంటున్నాడట. రానున్న రోజుల్లో ఈ పోటి మరింత ఎక్కువవుతుందని చెప్పుకుంటున్నారు.
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…