తెలుగు టీవీ పరిశ్రమలో ఎంత మంది యాంకర్ లు ఉన్నా అత్యంత గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ మాత్రం ప్రదీప్ మాచిరాజు ఒక్కడే. బుల్లి తెరపై తనకంటూ ఒక ప్రత్యేక ట్రెండ్ సెట్ చేసుకున్న యాంకర్. ఫిమేల్ యాంకర్ల హవా నడుస్తున్న తరుణంలో మేల్ యాంకర్ గా వచ్చి, తెలుగు ప్రేక్షకులలో ముఖ్యంగా యూత్ లో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు.
తాజగా ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న డ్రామా జూనియర్స్ షోలో తండ్రులు పడే కష్టాలను చూపిస్తూ ఒక స్కిట్ చేసారు. ఈ నేపధ్యంలో ఈ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్న డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ స్కిట్ చూస్తునన్నంత సేపూ నాకు యాంకర్ ప్రదీప్ గుర్తొచ్చాడు. ఎందుకంటే ఇటీవలే అయన తన తండ్రిని పోగొట్టుకున్నారు.. అందరినీ నవ్వించే ప్రదీప్ ఎందుకో ఆ బెంగలో పడిపోయాడేమో అనిపించి నాకు నిజంగా బాధేసింది అంటూ వ్యాఖ్యానించారు.
ఇక ఆ తరువాత అదే విషయంపై మరో జడ్జ్ అయిన సింగర్ సునీత మాట్లాడుతూ.. ప్రదీప్ మీ నాన్నగారిని ఒక్కసారి కూడా చూడలేకపోయానే.. అసలు కలవలేకపోయానే అని అనిపించింది కానీ మిమ్మల్ని చూస్తున్న కదా.. మీలోనే మీ నాన్నగారిని చూసుకుంటాను అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. తాజగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…