సరైన బ్రేక్ కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న తెలుగమ్మాయి ఈషా రెబ్బా. “అంతకుముందు ఆ తరువాత” చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన ఈషా, ఆ సినిమా మంచి విజయాన్ని సాధించినా ఈ అమ్మడుకి మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు “అరవిందసమేత” లో అవకాశం వచ్చినా పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. రాగాల 24 గంటల్లో, అమీ తుమీ, దర్శకుడు, ఆ!, బందిపోటు, బ్రాండ్ బాబు, వంటి చిత్రాలలో నటించినా ఆమెకు పెద్దగా బ్రేక్ రాలేదు..
ఇక తెలుగులో లాభం లేదు అనుకుంది కాబోలు తమిళ, కన్నడ భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అయితే తాజాగా బాలీవుడ్ లో ఓక బంపర్ ఆఫర్ కొట్టిందని తెలిసింది. సోనమ్ కపూర్ సోదరుడు హర్షవర్ధన్ కపూర్ హీరోగా రూపొందుతున్న ఓ బాలీవుడ్ చిత్రంలో ఈషా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. మహిళా సాధికారత నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. రాజ్ సింగ్ చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం భాద్యతలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…