సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ పెద్ద మాయా ప్రపంచం. దూరపు కొండలు నునుపు అనడానికి ఉదారహరణగా ఈ రంగుల ప్రపంచాన్ని చూపించవచ్చు. ఇక్కడ అందరికీ అన్నీ దొరకవు. దొరికినా లాగేసుకునేవాళ్ళే ఎక్కువమంది ఉంటారు. సక్సెస్ ఉంటేనే హీరోకైనా, డైరెక్టర్‌కైనా.. మరెవరికైనా క్రేజ్. లేదంటే ఎంత చులకనగా చూడాలో అంత చులకనగా చూస్తారు. నీ టాలెంటే నీ పెట్టుపడి. నీ దమ్ము ధైర్యమే నీ ఆయుధం అనే వాటిని నమ్ముకొని టాలీవుడ్ ఇండస్ట్రీకొచ్చి అద్భుతమైన విజయాలను అందుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఆయన ఏ కథ చెప్పాలన్నా ఎంతో ధైర్యంగా చెప్తాడు. ఎలాంటి టైటిల్ పెట్టాలన్నా ఎవరినీ లెక్కచేయరు.
ఇన్నేళ్ళ చిత్ర పరిశ్రమలో ఏ అగ్ర దర్శకుడు సంపాదించనంత డబ్బు, పేరు సంపాదించాడు. అందుకే ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటీని సంపాదించాడు. బద్రి సినిమాతో దర్శకుడిగా మారిన పూరి జగన్నాథ్ ఆ తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్స్ తీసి టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్‌గా మారాడు. ఆయన క్రేజ్ చూసి నిర్మాతలు, హీరోలు తన దర్శకత్వంలో సినిమా చేయాలని పడిగాపులు కాచిన రోజులున్నాయి. పూరి జగన్నాథ్ ఈ స్థాయికి రావడానికి కారణం. మార్గ దర్శకులు తన తల్లిదండ్రులే. వారే పాతిక వేలిచ్చి నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళు అక్కడ బాగుపడతావని చెప్పి పంపించారు.
అలాంటి ప్రోత్సాహం మళ్ళీ తన భార్య లావణ్య ఇచ్చారు. ఆవిడ ఇచ్చిన సపోర్ట్ నిజంగా పూరి కెరీర్ లో మళ్ళీ అసాధారణ స్థాయికి చేరుకునేలా చేసింది. పూరి జగన్నాథ్ ఆంధ్రావాలా అనే సినిమాను తీశారు. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ సమయంలో ఆస్తులను పోగొట్టుకున్నాడు. నమ్మిన స్నేహితుడే దాదాపు 80 కోట్ల పైనే మోసం చేశాడు. తన దగ్గర ఉన్న ఆస్తులన్నీ పోవడంతో పెంచుకుంటున్న కుక్కలకి కూడా ఫీడింగ్ ఇవ్వలేక కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. తన ట్రైనర్ కి ఇచ్చి పంపేసిన పూరి ఓ చిన్న అద్దె ఇంట్లోకి మారాడు. ఒక్కసారిగా భారీ సక్సెస్ లు చూసి రోడ్డున పడితే ఎవరైనా అక్కున చేర్చుకుంటారు.
కానీ పూరి జగన్నాథ్‌కి ఆ సమయంలో అండగా నిలిచి సపోర్ట్ ఇచ్చిన వారెవరూ లేరని స్వయంగా వెల్లడించాడు. అలాంటి సమయాలలోనే అందరి అసలు రంగు బయట పడుతుందని చెప్పుకొచ్చిన పూరి తను బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఏ హీరో పట్టించుకోలేదని.. ఒక్క భార్య మాత్రమే నాకు అన్ని విధాల తోడుగా నిలిచిందని వెల్లడించాడు. అయితే స్టార్ కమెడియన్ అలీ ఒక నగ తీసుకువచ్చి పూరి చేతిలో పెట్టి ఇది నీ దగ్గర పెట్టుకో నువ్వు పోగొట్టుకున్నవన్ని మళ్ళీ తిరిగొస్తాయని చెప్పాడు. దేవుడుని, ఇలాంటి వాటిని నమ్మని పూరి.. ఆ నగ తన భార్య లావణ్యకిచ్చి ఇలా అలీ ఇచ్చాడు అని చెప్పాడు. అలీ చెప్పినట్టుగానే పూరి పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ తిరిగొచ్చాయి.
పడిలేచిన కెరటంలా పూరి జగన్నాథ్ మళ్ళీ బ్లాక్ బస్టర్స్ తీసుకున్నాడు. సొంత నిర్మాణ సంస్థలో కొడుకుతో పాటు విజయ్ దేవరకొండతో తీసుకున్న లైగర్ సినిమా ఈ ఏడాది రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ లైఫ్ ఇండస్ట్రి వారికే కాదు కామన్ ఆడియన్స్ కి కూడా ఎంతో ఇన్స్పిరేషన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిందే. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో ఎంతో సన్నిహితంగా ఉండే పూరి జగన్నాథ్ ఆయన వద్ద కూడా సహాయం తీసుకోవాలంటే ఇబ్బందిగా ఫీలవుతాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…