Categories: FeaturedHealth News

మొక్కజొన్న తిన్న వెంటనే నీరు తాగకూడదా.?

మొక్కజొన్న పొత్తులను తింటున్నారా.. ఎందుకంటే ఇవి పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఎంతో ఇష్టంగా తినే ఆహారం. ముఖ్యంగా వ‌ర్షం ప‌డుతున్న స‌మ‌యంలో వేడి వేడిగా మొక్క‌జొన్న తింటే ఆ మాజానే వేరు. కాల్చుకుని కాని, ఉడకపెట్టుకుని కాని.. ఇలా ఎలా తిన్నా మొక్క‌జొన్న‌ టేస్టీగానే ఉంటాయి. ఇక ఈ సీజ‌న్‌లో ఎక్కువగా ల‌భించే మొక్క‌జొన్న కేవలం ఒక్క రుచిలోనే కాదు. ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూర్చ‌డంలోనూ అమోఘం అని చెప్పాలి. మ‌రి మొక్క‌ జొన్న ఏ విధంగా ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డుతుంది? ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకోండి.

ఆరోగ్యకరమైన కోలెస్ట్రాల్‌ని శరీరం కలిగి ఉండాలి అనే వాస్తవాన్ని విస్మరించి పుష్టికరమైన ఆహారాన్ని దూరం పెట్టడం ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. కానీ., మొక్కజొన్నలో బీటా, కెరోటిన్‌ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల మొక్కజొన్న గింజలను తింటే 1 రోజులో అవసరమైన విటమిన్‌–ఏ లోని 6 శాతం మనకు సమకూరుతుంది. విటమిన్ ఏ మన కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే. మొక్కజొన్నలో ఫెలురిక్‌ యాసిడ్‌ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. అనేక రకాల క్యాన్సర్లను నివారించే సామర్థ్యం దానికుంది. అంతే కాకుండా.. అది వయసు పెరుగుతున్నప్పుడు కనిపించే దుష్ప్రభావాలను అరికడుతుంది. గాయం అయినప్పుడు కలిగే వాపు, మంట, నొప్పిను తగ్గించే శక్తి కూడా మొక్కజొన్నకి ఉంది.

మొక్కజొన్నలో విటమిన్‌ బి–కాంప్లెక్స్‌లోని థయామిన్, నియాసిన్, పాంటోథెనిక్‌ యాసిడ్, ఫోలేట్స్, రైబోఫ్లేవిన్, పైరిడాక్సిన్‌ వంటివి పుష్కలంగా ఉన్నాయి. మన శరీరంలో జరిగే అనేక జీవక్రియల నిర్వహణకు అవి తోడ్పడతాయి. ఇక మన ఆరోగ్యానికి అవసరమైన ప్రధాన ఖనిజాలైన జింక్, మ్యాంగనీస్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్‌ వంటివి కూడా మొక్కజొన్నలో చాలా ఎక్కువ. అందుకే తక్కువ ధరకే అందుబాటులో ఉండే మొక్కజొన్ననూ వదలొద్దు. మొక్కజొన్నలో పీచు ప‌దార్థం పుష్కలంగా ఉంటుంది. జీర్ణ‌ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు మొక్క‌జొన్న తింటే చాలా మంచిది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌వారు మొక్క‌జొన్న తింటే. ఇందులో ఉండే విటమిన్‌ బి 12 మ‌రియు ఐరన్ ర‌క్తాన్ని పెంపొందిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే విటమిన్ ఏ, గుండె జ‌బ్బుల‌ను నివారించే మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్ ఫరస్ కూడా మెక్క‌జొన్న‌లో ఉంటాయి. మ‌ధుమేహంతో బాధ‌ప‌డేవారు కూడా మొక్క‌జొన్న తినొచ్చు. త‌ద్వారా షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.

అలాగే మొక్క‌జొన్న తిన‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వంటి భ‌యంక‌ర స‌మ‌స్య‌ల‌కు కూడా చెక్ పెట్ట‌వ‌చ్చు. ఎందుకంటే, మొక్కజొన్నలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ క‌ణాల‌తో పోరాడ‌తాయి. శ‌రీరంలో అద‌న‌పు కొవ్వును క‌రిగించ‌డంలోనూ మొక్క‌జొన్న అద్భుతంగా ప‌ని చేస్తుంది.అందుకే ఎన్నో పోష‌కాలు ఉన్న మొక్క‌జొన్న‌ను డైట్‌లో చేర్చుకోమ‌ని, మొక్క జొన్నలోని విటమిన్లు, యాంటీ యాక్సిడెంట్లు, ఖనిజాలు, రసాయనాలు మానన శరీర ఆరోగ్యాన్ని అత్యంత సమతుల్యతలో ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చాటి చెబుతున్నారు. అయితే మొక్కజొన్న కంకులు తిన్న వెంటనే నీరు తాగకూడదట. మన పూర్వీకులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. దానికి బలమైన కారణమేమిటంటే.. మొక్కజొన్న తింటే జీర్ణ సంబంధమైన ఇబ్బందులు వస్తాయి. మొక్కజొన్నలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకని వెంటనే నీళ్లు తాగితే ఆ ఫైబర్ పదార్థం జీర్ణం కాదు. కాబట్టి మొక్కజొన్న తిన్న వెంటనే నీళ్లు తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. ఒక్కోసారి తలనొప్పి, వాంతులు కూడా రావచ్చు. అందుకే మొక్కజొన్న తిన్న 40 నిమిషాల తర్వాతే మంచి నీళ్లు తాగాలి. అప్పటికీ కొంత జీర్ణమవుతుంది కాబట్టి ఆ తర్వాత నీళ్లు తాగితే మన ఆరోగ్యంలో ఎలాంటి సమస్యలు ఉండవు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago