1980 దశకంలో అప్పుడు తెలుగు నాట ఇంటింటికి దూరదర్శన్ లేదు కేవలం ఆకాశవాణిలో మాత్రమే చిత్రాలు, చిత్ర విశేషాలు, పాటలు వినడానికి మాత్రమే అవకాశం ఉండేది. ఉదయం లేవగానే జనరంజని కార్యక్రమంలో మనకి వినపడే మాట భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ మూవీలో నుంచి ఈ పాట అంటూ… ఓ ప్రత్యేకమైన వాయిస్ చాలా గమ్మత్తుగా వినిపించేది. ఆ దశకంలో భార్గవ్ ఆర్ట్స్ అంటే బ్లాక్ బస్టర్.. బ్లాక్ బస్టర్ అంటే భార్గవ్ ఆర్ట్స్ అనే పేరు ఉండేది.
అయితే 1951లో నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సన్నారెడ్డి. గోపాల్ రెడ్డి జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టడం వలన ఎస్.గోపాల్ రెడ్డి వ్యవసాయం చేస్తాడు అని ఆయన తల్లిదండ్రులు అనుకున్నారు. ఆ తర్వాత అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాడు.తన ఎదుగుదలకు ఉన్నచోటు ప్రతిబంధకం అని తన మకాము మద్రాస్ కు మార్చాడు. అక్కడ సహచరుల సహాయముతో సినిమాల వైపు మొగ్గు చూపడం జరిగింది.
తన స్నేహితుడు సోమవారపు సుధాకర్ రెడ్డితో కలిసి డబ్బింగ్ చిత్రాలను చేయడం ప్రారంభించాడు. అలా మొదటగా తమిళంలో కమల్ హాసన్, శ్రీదేవి నటించిన సినిమాను తెలుగులోకి చిలిపి కృష్ణుడు పేరుతో డబ్బింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాహం దాహం అనే చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఆ తర్వాత గోపాల్ రెడ్డి సొంతంగా భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి సొంతంగా సినిమాలు తీయడం మొదలు పెట్టారు.
అలా భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో మొదటగా మనిషికో చరిత్ర హిట్ అవగా సుమన్, భానుచందర్, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా ముక్కుపుడక చిత్రాన్ని నిర్మించారు. ఇది బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది.అపరాధి సినిమా ఆవరేజ్ గా నిలువగా 1984 లో వచ్చిన మంగమ్మగారి మనవడు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలా బాలకృష్ణ తో ముద్దుల కృష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు ఆ తర్వాత మాతో పెట్టుకోకు లాంటి చిత్రాలను తీయడం జరిగింది. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించాయి.
భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్లో బాలకృష్ణ తో కాకుండా నాగార్జున తో మురళి కృష్ణ, అర్జున్ తో మాపల్లెలో గోపాలుడు, మన్నెంలో మొనగాడు శ్రీకాంత్ మధురానగరిలో, రాజశేఖర్ తో రథయాత్ర, వడ్డే నవీన్ తో మా బాలాజీ లాంటి చిత్రాలను నిర్మించడం జరిగింది. అందుకే ఎస్.గోపాల్ రెడ్డి ఇంటి పేరు సన్నా రెడ్డి అయినప్పటికీ ఆయన ఇచ్చిన సక్సెస్ మూవీస్ తో సినీ పరిశ్రమలో అంతా ఆయనను సుడి గోపాలరెడ్డి అని పిలిచేవారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…