Categories: FeaturedHealth News

ర‌క్తంలో ప్లేట్‌లెట్లు పెర‌గాలంటే.. వీటిని తినాలి..!

ప్లేట్‌లెట్స్‌… వీటి గురించి మీరు వినే ఉంటారు. ప్ర‌ధానంగా డెంగీ జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు ఇవి ఎక్కువ‌గా క్షీణిస్తాయి. అంటే ర‌క్తంలో ఉన్న వాటి సంఖ్య ఒకేసారి ప‌డిపోతుంది. దీంతో ఆరోగ్యం మ‌రింత విషమించి ప్రాణాపాయ స్థితి వ‌స్తుంది. కొన్ని సంద‌ర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వ‌స్తుంది. అయితే అలాంటి జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు వైద్యులు ఇచ్చే మందుల‌తోపాటుగా కింద పేర్కొన్న ప‌లు ఆహార ప‌దార్థాల‌ను తీసుకుంటే ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను బాగా పెంచుకోవ‌చ్చు. దీంతో వ్యాధి నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను బాగా పెంచుకోవాలంటే ప్రధానంగా ఇవి పాటించాలి..

బొప్పాయి పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల డెంగీ వ‌చ్చిన వారు త్వ‌ర‌గా కోలుకుంటారు. ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా పెరుగుతుంది.

దానిమ్మ పండ్ల‌ను తిన్నా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఇది ర‌క్తం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఆకుప‌చ్చ‌గా ఉండే ఆకుకూర‌లు, కూర‌గాయ‌ల‌ను ఎక్కువ‌గా తినాలి. దీంతో వాటిలో ఉండే విట‌మిన్ కె ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచుతుంది.

వెల్లుల్లి రేకుల్ని ఆహారంలో భాగంగా తీసుకుంటే చాలా మంచిది. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య వృద్ధి చెందుతుంది.

ర‌క్త‌హీన‌త‌తో బాధ‌పడేవారే కాదు, డెంగీ వ‌చ్చిన వారు కూడా బీట్ రూట్ జ్యూస్‌ను తాగ‌వ‌చ్చు. దీంతో ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.

క్యారెట్‌ను త‌ర‌చూ తింటున్నా ర‌క్తం వృద్ధి చెంది తద్వారా ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.

ఎండు ద్రాక్ష‌ల్లో 30 శాతం ఐర‌న్ ఉంటుంది. ఇది ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచుతుంది.

ఆప్రికాట్ పండ్ల‌ను నిత్యం రెండు సార్లు తీసుకున్నా చాలు. ర‌క్తం వృద్ధి చెంది ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.

ఎండు ఖ‌ర్జూరం, కివీ పండ్ల‌ను తింటున్నా ప్లేట్‌లెట్లను బాగా పెంచుకోవ‌చ్చు. దీంతో వ్యాధి త‌గ్గుముఖం ప‌డుతుంది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago