దేశంలో పసిపాపలకే కాదు కనీసం పండుముసలికి కూడా భద్రత లేదన్న విషయం మరోసారి రుజువైంది. బీజేపీ పాలిత ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లో వందేళ్ల వృద్ధురాలు అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటాన జరిగింది. మీరట్ శివారు గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
దళిత కుటుంబానికి చెందిన ముసలావిడ వయో భారంతో కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైపోయింది. ఆదివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన అంకిత్ పునియా(35) అనే యువకుడు దారుణాంగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ముసలావిడ గట్టిగా అరవలేని స్థితిలో, ఆమె దీనంగా ఏడ్చిన ఏడుపులు,అరుపులు వినబడటంతో చుట్టు పక్కలవారు స్పందించారు. ఏం జరిగిందోననే కంగారుతో తలుపులు తెరిచిన వారికి యువకుడు చేస్తున్న అకృత్యాన్ని చూసి షాకయ్యారు. వెంటనే అతణ్ని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ సంఘటానతో అసలే బలహీనంగా, నీరసించిన బాధితురాలి ఆరోగ్యస్థితి ఇంకా దిగజారింది. సోమవారం ఉదయాని కల్లా పోలీసులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యం అందే లోపే ఆ వృద్ధురాలు మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. పోస్ట్‌మార్టం తదనంతరం మృతురాలి శరీరభాగాలను లక్నోలోని ఫోరెన్సిక్ విభాగానికి పంపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…