1980 దశకం చివరి సంవత్సరాలలో తెలుగు తెరకు పరిచయమైన కేరళ కుట్టి వాణి విశ్వనాథ్.ఆమె ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ సినిమాకి మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఎక్కువగా గ్లామరస్ పాత్రలోనే తెలుగు ప్రేక్షకులను ఆమె అలరించారు. 1971 కేరళ లో వాణి విశ్వనాథ్ జన్మించారు. ఆమె నాన్నగారు పేరుపొందిన జ్యోతిష్కుడు. మలయాళం, తమిళ సినిమాలకి ముహూర్తాలు నిర్ణయించే పండితునిగా ఆయన పేరు ప్రఖ్యాతులు పొందారు. వాణి విశ్వనాథ్ తెలుగులో చిన్ని కృష్ణుడు సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు.
ఆ తర్వాత సింహస్వప్నం, ధర్మ తేజ, కొదమసింహం, కొండవీటి రౌడీ సర్పయాగం, చిన్న కోడలు ఆయుధం, ఘరానా మొగుడు, సామ్రాట్ అశోక, నేటి దౌర్జన్యం, ప్రెసిడెంట్ గారి అల్లుడు, ప్రేమ యుద్ధం, అలెగ్జాండర్ లాంటి చిత్రాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి తో వాణి విశ్వనాథ్ రెండు చిత్రాల్లో నటించారు. ఆమె పేరు చెప్పగానే ఘరానా మొగుడు చిత్రంలోని అబ్బాబ్బా.. ఇది ఏమి వాన…అనే వాన పాట గుర్తుకొస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే వాణి విశ్వనాథ్ కి ఘరానా మొగుడు చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆమెకు తెలుగు సినీ పరిశ్రమలో అనేక అవకాశాలు వచ్చాయి.
ఆమె 2002లో తమిళనాడుకు చెందిన బాబురాజ్ అనే సహనటుడిని పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కొడుకు,కూతురు కూడా ఉన్నారు. తెలుగు పరిశ్రమ మీద అభిమానంతో యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాణి విశ్వనాథ్ ఎలాగైనా దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వంలో నటించాలని.. ఆయన రూపొందించిన జయ జానకి నాయక చిత్రంలో వాణి విశ్వనాథ్ ఒక పాత్రలో కనిపించారు. అలాగే ఎన్టీరామారావు గారి మీద అభిమానంతో ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ అభివృద్ధికి ఆమె కృషి చేస్తున్నారు. అయితే ఆమె సోదరి ప్రియా వాణి విశ్వనాథ్ కూతురు వర్షవిశ్వనాథ్ తెలుగులో “రెడ్డి గారి ఇంట్లో రౌడీ ఇజం” అనే సినిమాలో నటిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే వర్ష విశ్వనాథ్ తెలుగులో అగ్ర హీరోల సరసన నటించి వాణి విశ్వనాథ్ వారసురాలిగా మంచి పేరు సంపాదించుకుంటుదని ఆశిద్దాం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…