అచ్చతెలుగమ్మాయి అంజలి తూర్పు గోదావరి జిల్లా, రాజోలులో పుట్టి పెరిగింది. తన తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా వేరే దేశంలో ఉంటున్నారు. దాంతో ఆమె పిన్ని, బాబాయ్ ల వద్ద కొంతకాలం ఉంది. 10వ తరగతి వరకు సొంత ఊరులో చదువుకున్న అంజలి.. బంధువులు ఉండటంతో ఆ తర్వాత చెన్నైకు షిఫ్ట్ అయింది. చెన్నైలో డిగ్రీ చేస్తూనే షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించే అవకాశాలు అందుకుంది. పాకెట్ మనీ కోసం ఖర్చుల కోసం ఈ షార్ట్ ఫిలింస్ లో నటించింది అంజలి. అవే తనకి సినిమా అవకాశాలు కల్పిస్తాయని ఊహించలేదు. అలా ముందు తమిళంలో జీవా కి జంటగా ఒక సినిమాలో నటించే అవకాశం అందుకుంది. అదే సినిమా తెలుగులోనూ ‘డేర్’ అనే పేరుతో విడుదలయింది.
డెబ్యూ సినిమా ఈమెకి మంచి గుర్తింపు తీసుకు వచ్చింది. దాంతో 2006లో ‘ఫొటో’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత అంజలి నటించిన ‘షాపింగ్‌మాల్’ తో అటు తమిళ ఇండస్ట్రీ ఇటు తెలుగు ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. తెలుగమ్మాయి అనే తీరు తెన్నులు అంజలి పర్ఫార్మెన్స్ లో కనిపించాయి. ఈ సినిమాలో అంజలి నేచురల్ పర్ఫార్మెన్స్ కి మేకర్స్ బాగా ఇంప్రెస్ అయ్యారు. ఇక ‘షాపింగ్‌మాల్’ మూవీ చూసే డైరెక్టర్ మురుగదాస్ ‘జర్నీ’లో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా 2011లో విడుదలైంది. మొదటిసారి ‘జర్నీ’ సినిమాతో అంజలికి స్టార్ ఇమేజ్ వచ్చింది. మరోసారి తన నేచురల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.
ఈ సినిమాతో ఎక్కువగా తెలుగు దర్శక, నిర్మాతలను ఆకట్టుకుంది. ఈ సినిమా చూసే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఆయన నిర్మించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో సీతగా, వెంకటేశ్ సరసన నటించే అవకాశం కల్పించారు. 2013లో వచ్చీ ఈ సినిమాతో టాలీవుడ్ లో సెటిలయింది అంజలి. దీని తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన ‘బలుపు’ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. అలాగే సింగం-2 తమిళ వెర్షన్‌లో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చింది అంజలి. ఇలా ఒకవైపు తెలుగు మరోకవైపు తమిళ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది.
దాంతో తన పిన్నీ, బాబాయ్ డబ్బుకోసం ఆమెను వేధించారు. మొదట్లో ఇవన్నీ ఇబ్బంది పడినప్పటికి .. చాలామంది హీరోయిన్స్ విషయంలో జరుగుతుందని అర్థం చేసుకుంది. కేవలం బాబాయ్, పిన్నీలతో మాత్రమే కాకుండా ఓ తమిళ దర్శకుడు వల్ల కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. తన డబ్బు మొత్తం తీసుకొని తనని ఓ ఏటీఎం లా వాడుకున్నారని ఓ ఇంటర్వ్యూలో వాపోయింది. ఇదే సమయంలో అంజలి అజ్ఞాతంలోకి వెళ్ళిందని వార్తలు వచ్చాయి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, బలుపు సినిమాల సూపర్ హిట్స్ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేసింది. ఆ ఆనందంలో ఉండి కెరీర్ మరింత ఆసక్తిగా సాగుతుందని భావించిన ఆమెకి ఫ్యామిలీ కష్టాల కడలిలోకి నెట్టేసింది.
దాంతో ఈ ఇబ్బందుల్లో సినిమాలను ఎందుకు కమిటవడం అని కొంతకాలం సినిమాలను ఒప్పుకోలేదు. దాంతో అందరూ అంజలి ఇక సినిమాలు చేయదని మాట్లాడుకున్నారు. ఇక కుటుంబంతో వచ్చిన సమస్యల వల్ల కోర్టు వరకు వెళ్ళింది. ఎట్టకేలకి ఎవరినీ నమ్మకూడదని డిసైడయిన అంజలి మళ్ళీ రీచార్జ్ అయి సినిమాలు చేసుకుంటూ వస్తోంది. ఇక అంజలి కుటుంబంతో ఎదురుకొన్న సమస్యలను అధిగమించడానికి గానీ, సినిమాలను ఎంచుకోవడానికి గానీ తన స్నేహితుల సపోర్ట్ చాలా ఉందని తెలిపింది. ఇక ఆమె నటించిన అంజలి సినిమా తర్వాత నుంచి తన కెరీర్ లో ఎలాంటి పరిణామాలు ఎదురైనా దానికి బాధ్యత తనదేనని క్లారిటీగా చెప్పింది. అయితే తనవాళ్ళు మోసం చేసిన మొత్తం దాదాపు 3 కోట్లకి పైగానే ఉంటుందట. ఆ మొత్తం తిరిగి రాకపోవచ్చనే సందేహం కూడా అంజలి వ్యక్తం చేసింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…