ఇండియాలోని ఫార్మా పరిశ్రమ భారీగా వృద్ది చెందుతుంది. ఈ నేపధ్యంలో 2030 సం. వరకు దేశీయ ఫార్మా పరిశ్రమ సుమారు 130 బిలియన్ డాలర్లకు చేరుతుందని తాజాగా అంచనా వేస్తున్నట్టు తెలిపారు డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ కే సతీష్ రెడ్డి. దీని విలువ మన దేశ కరెన్సీలో చూస్తే దాదాపు రూ.9.7 లక్షల కోట్లు. ఇక ప్రస్తుతం మన దేశంలో ఫార్మా పరిశ్రమ 42 బిలియన్ డాలర్ల మేర అమ్మకాలు కొనసాగుతున్నాయని, అయితే అందులో సగం దేశీయ అమ్మకాలు, మిగిలిన సగం ఎగుమతుల ద్వారా వస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇక ప్రస్తుతం పార్మా స్పీడ్ చూస్తుంటే వచ్చే పది సంవత్సరాలలో దీని విలువ సుమారు మూడు రెట్లు పెరుగుతాయని తాము అంచనా వేస్తున్నట్లు అయన తెలిపారు. మరోవైపు ఆత్మ నిర్భర్ భారత్ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పరిశోధనలకు ఇస్తున్న ప్రాధాన్యతలతో పరిశ్రమ వృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…