మన జీవితంలో వివాహం అనేది ఎంతో ముఖ్యమైన వేడుక. ఈ పెళ్లి వేడుక పది కాలాలపాటు గుర్తుగా ఉండాలని ఎంతో ఘనంగా వివాహం జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుత కాలంలో పెళ్లి అంటే భారీ స్థాయిలో ఫోటో షూట్లు, వీడియోలు ఉంటాయి. ఇకపోతే కొన్ని జంటలు వివాహానికి కంటే ముందుగా ప్రీ వెడ్డింగ్ షూట్ ను చేస్తుంటారు. ఈ క్రమంలోనే వెడ్డింగ్ షూట్ కోసం చాలా మంది ప్రాణాలను ప్రమాదంలో పెడుతుంటారు. ఇలాంటి ఎన్నో సంఘటనల గురించి మనం వినే ఉంటాం.
తాజాగా ఓ జంట ఈ విధంగానే ఫ్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించుకున్నారు.ఈ క్రమంలోనే ఈ వెడ్డింగ్ షూట్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్తా వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఈ జంట పై ఓ రేంజ్ లో మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ జంట చేసిన పని ఏమిటి.. నెటిజన్లు ఎందుకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం…
అమెరికాకు చెందిన ఓ జంట ఫ్రీ వెడ్డింగ్ షూట్ ను నిర్వహించారు. ఈ వెడ్డింగ్ షూట్ ఎంతో భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ జంట గతంలో అమెరికాలో కొనసాగిన బానిసత్వం తీమ్ ద్వారా ఫోటో షూట్ నిర్వహించారు.ఈ క్రమంలోనే వారు ఉపయోగించే వస్తువులను నుంచి దుస్తుల వరకు అప్పటి కాలానికి చెందినవిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విధంగా ఫోటో షూట్ నిర్వహించుకున్న ఈ జంటకు సంబంధించిన ఫోటోలను ఒక టిక్ టాకర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్తా నెట్లో తెగ చక్కర్లు కొట్టేస్తూ దారుణంగా ట్రోలింగ్ కు గురయ్యాయి.
ఈ క్రమంలోనే నెటిజన్లు అందరూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు టిక్ టాకర్ ఆ వీడియోను డిలీట్ చేశాడు. ఈ ఫోటో షూట్ లో ఉన్న జంటలో అమ్మాయి వైట్ అమెరికన్ కాగా, అబ్బాయి బ్లాక్ అమెరికన్. ఈ ఫోటోలో అబ్బాయి ఒక బానిసగా మనకు కనిపిస్తాడు. గుబురు చెట్ల మధ్యలో సాగిన ఈ ఫోటో షూట్ చూస్తుంటే అప్పటికాలంలో చెరుకు తోటలలో బానిసలుగా పనిచేసిన వ్యక్తులుగా కనిపిస్తారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ జంటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో మనం తినే ప్రతి పదార్థాన్ని జాగ్రత్తగా పరిశీలించే అలవాటు పెరిగింది. ముఖ్యంగా చక్కెర…
చికెన్ అనేది భారతీయుల ఆహారంలో ముఖ్యమైన భాగంగా మారింది. తక్కువ ఖర్చుతో మంచి ప్రోటీన్ లభించడంతో చాలామంది వారానికి పలుమార్లు…
ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది రోజూ వేడి నీళ్లు తాగే అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం…
పిల్లల పెరుగుదల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఏం ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనే సందేహాలు…
ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం చాలా మంది ఖరీదైన సప్లిమెంట్లు, ప్రోటీన్ పౌడర్లు వంటివి…
భారతదేశంలో క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో నోటి క్యాన్సర్ వేగంగా పెరుగుతోందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. Indian…