డెల్టా వేరియంట్ మన దేశంలో సెకండ్ వెవ్ కారణం అయ్యింది. దురదృష్టవశాత్తు అదే ఇప్పుడు మ్యూటేషన్ చెంది డెల్టాప్లస్ వేరియంట్‌గా కొత్త రంగు పులుముకుంది. ప్రస్తుతం మన దేశంలో ఈ వేరియంట్‌కు చెందిన కేసులు నమోదవుతున్నాయి.
మన దేశంలో ఇప్పటివరకు 40కి పైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మహా రాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే కర్ణాటక, తమిళ నాడు, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో కూడా డెల్టా ప్లస్ కేసులు మొదలయ్యాయి. డెల్టా వేరియంట్ మాదిరిగా అత్యంత వేగంగా వ్యాప్తి చెందడం దీని లక్షణం, అదే విధంగా దక్షిణాఫ్రికా వేరియంట్ లానే టీకాల నుంచి తప్పించుకునే లక్షణం ఈ డెల్టా ప్లస్ కు ఉందని అందువల్ల అందరూ దీనిపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డెల్టా ప్లస్ సోకినట్టు గుర్తించిన వారిలో తొలిసారిగా మధ్యప్రదేశ్‌లో మహిళ తాజాగా చనిపోవడంతో దేశం మరింత అప్రమత్తం అయ్యింది. అయితే ఆ మహిళ కరోనా కోసం ఎటువంటి టీకాలు తీసుకోలేదు అందువల్ల ఆమెపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని ప్రకటించారు వైద్యులు.
ఇక డెల్టా ప్లస్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపించడంతో పాటు, ఊపిరితిత్తులకు బలంగా అతుక్కొని ఉండటం, మోనోక్లోనాల్ వంటి యాంటీబాడిల చికిత్సకు ఏమాత్రం ప్రభావితం కాకపోవడం వంటి లక్షణాలు కలిగి ఉండటంతో దీనిపై పరిశోధనలు ముమ్మరం చేస్తున్నారు ఐసీఎంఆర్, ఎన్ఐవీ శాస్త్రవేత్తలు. ఇదే డెల్టా ప్లస్ చికిత్సకు లొంగకుండా, వేగంగా వ్యాపించే లక్షణం కలిగి ఉంటే, మూడో వేవ్‌కు కారణం అయ్యే అవకాశాలు ఉన్నయాని నిపుణులు చెబుతున్నారు.
ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…
ధ్యానం, భక్తి, ఆధ్యాత్మిక అనుభవాల గురించి మాట్లాడితే కొన్ని విశేష సంఘటనలు తరచూ వినిపిస్తుంటాయి. ముఖ్యంగా గజ్జెల చప్పుళ్లు వినిపించడం…
వేసవి కాలంలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఏసీపై ఆధారపడుతున్నారు. ఇంట్లోనూ, కార్యాలయాల్లోనూ గంటల తరబడి ఏసీలో…
వేసవి కాలంలో దాహం తీర్చే పండ్లలో పుచ్చకాయకు ప్రత్యేక స్థానం ఉంది. నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది…
ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో మనం తినే ప్రతి పదార్థాన్ని జాగ్రత్తగా పరిశీలించే అలవాటు పెరిగింది. ముఖ్యంగా చక్కెర…
చికెన్ అనేది భారతీయుల ఆహారంలో ముఖ్యమైన భాగంగా మారింది. తక్కువ ఖర్చుతో మంచి ప్రోటీన్ లభించడంతో చాలామంది వారానికి పలుమార్లు…