30 సంవత్సరాలుగా పైగా తన నటనా ప్రస్థానం కొనసాగిస్తూ మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. అయితే ఈ ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఆయన ఎన్నో విధాల కష్టపడి ఈ స్థానానికి చేరుకున్నారు. టాలీవుడ్ లో ఎటువంటి రోల్ అయినా సరే అవలీలగా చేసే చిరంజీవి… టాలీవుడ్ ప్రేక్షకులతో మెగాస్టార్ అనిపించుకున్నారు. అయితే ఆయన సినిమాలు చేస్తున్న సమయంలో ఓ హీరోయిన్ ఇబ్బంది పెట్టింది అంటే మీరు నమ్ముతారా…? నిజానికి ఈ విషయం చాలా మంది నమ్మరు కూడా. అసలు ఈ విషయం గురించి చాలామందికి తెలియదు. ఆమె ఎవరో కాదు అప్పట్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అందాల తార శ్రీదేవి.
చిరంజీవి శ్రీదేవి కలిసి మొదటిసారిగా మోసగాడు సినిమాలో నటించారు. ఆ సినిమాలో వారిద్దరి కాంబినేషన్లో పాట కూడా వస్తుంది. ఇక ఆ తర్వాత రాణికాసుల రంగమ్మ, జగదేకవీరుడు అతిలోకసుందరి, ఎస్పీ పరశురామ్ లాంటి పలు చిత్రాలు చిత్రీకరించారు. అప్పటివరకు ఇద్దరూ బాగానే ఉన్నా … జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా రాకముందు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాలను తీయాలని అనేక మంది దర్శక నిర్మాతలు ఎంతగానో ప్రయత్నించారు.
ముందుగా హీరో చిరంజీవి కి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇక శ్రీదేవి గురించి చెబితే.. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ అని తేడా లేకుండా ఎక్కడ మంచి సినిమా అవకాశం లభిస్తే అక్కడ చేసుకుంటూ తారాస్థాయికి చేరుకుంది. తాను నటించబోయే సినిమాలో ఎంత పెద్ద హీరో అయినా సరే, తన క్యారెక్టర్ రోల్ ఎక్కువగా ఉండాలని… తాను అడిగినంత పారితోషికం ఇయ్యాలని, అంతేకాకుండా తాను సినిమాలో ఏవైనా మార్పులు చెబితే కచ్చితంగా చేయాలి అని దర్శక నిర్మాతలను అప్పట్లో హీరోయిన్ శ్రీదేవి తెగ తిప్పలు పెట్టేది. ఇలా శ్రీదేవి చెప్పిన కండిషన్స్ కి కొన్ని సినిమాలు తెరకెక్కినా, మరికొన్ని సినిమాలు మాత్రం అసలు పట్టాలు ఎక్కలేదు. ఇక ఆ సినిమాల విషయం గురించి ఓ సారి చూస్తే…
ఇక అందులో మొదటిగా చెప్పుకునే సినిమా వజ్రాల దొంగ. దర్శకుడు కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి అందాల నటి శ్రీదేవి జంట తో సినిమాను రూపొందించామని అనుకున్నారు. కాకపోతే ఆ సినిమాను శ్రీదేవి నిర్మాణ బాధ్యతలు చేపడతారని, అయితే ఆ సినిమాలో తానే నిర్మాత కాబట్టి హీరో కంటే తనకే ఎక్కువ క్యారెక్టర్ ఉండేవిధంగా కథ రాయాలని తెలపగా అందుకు హీరో చిరంజీవి ఒప్పుకోలేదు. దీంతో ఆ సినిమా అక్కడితో ఆగిపోయింది. అయితే ఆ తర్వాత మరోసారి దర్శకుడు కోదండరామిరెడ్డి కొండవీటి దొంగ సినిమా కోసం చిరంజీవి సరసన శ్రీదేవి నటింపజేయాలని అనుకున్నారు. అయితే ఆ సినిమా కథంతా విన్నాక శ్రీదేవి సినిమా టైటిల్ ని మార్చమని తెలిపింది. అయితే అందుకు కొండవీటి రాణి కొండవీటి దొంగ అని పేరుని పెట్టాలని తెలిపింది. అంతే కాదు ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ తో పాటు తన క్యారెక్టర్ కూడా సమానంగా ఉండాలని డిమాండ్ చేసింది. ఇకపోతే ఈ సినిమాకు హీరోయిన్ శ్రీదేవి పెట్టిన కండిషన్స్ నచ్చకపోవడంతో హీరో చిరంజీవి ఆ సినిమా నటించడం ఆపేశారు.
అయితే ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఆ సినిమాలో విజయశాంతి, రాధా ఇద్దరు హీరోయిన్లు కలిసి నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఆ సినిమా తర్వాత చిరంజీవి శ్రీదేవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి వద్ద కూడా పేచి పెట్టింది నటి శ్రీదేవి. ముందుగా ఈ సినిమాకు జగదేకవీరుడు అనే టైటిల్ నిర్ణయించారు. ఇక ఆ టైటిల్ కు కూడా హీరోయిన్ అడ్డు చెప్పడంతో చివరకు జగదేకవీరుడు – అతిలోకసుందరి గా పేరును మార్చారు. ఇలా హీరోయిన్ శ్రీదేవి తనకు అనవసరమైన విషయాలలో తలదూర్చడంతో చిరంజీవితో నటించాల్సిన రెండు సినిమాలను చేయలేకపోయింది. పూర్తిగా ఆ సినిమాలు మొదలు కాకముందే ఆగిపోయాయి.
ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది రోజూ వేడి నీళ్లు తాగే అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం…
పిల్లల పెరుగుదల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఏం ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనే సందేహాలు…
ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం చాలా మంది ఖరీదైన సప్లిమెంట్లు, ప్రోటీన్ పౌడర్లు వంటివి…
భారతదేశంలో క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో నోటి క్యాన్సర్ వేగంగా పెరుగుతోందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. Indian…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం కోసం వేగవంతమైన మార్గాలపై ఆసక్తి పెరుగుతోంది. డైట్, వ్యాయామం కంటే త్వరగా ఫలితం రావాలనే…
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, అసమయ భోజనం, తక్కువ నీటి వినియోగం వంటి కారణాల వల్ల మలబద్ధకం సమస్య చాలా మందిలో…