Categories: FeaturedMovie News

ప్రమాదం కారణం గా గుర్తు పట్టకుండా మారిపోయిన ఈ హీరో ఇపుడు ఎలా ఉన్నాడో తెలుసా !!

శశి కుమార్ … కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ నటుడు మరియు రాజకీయవేత్త గా కూడా రాణించారు . కన్నడ చిత్రాలలో పాపులర్ స్టార్ అయిన ఆయనతెలుగు తమిళ సినిమాలో కూడా కనిపించారు, ఇందులో రజనీకాంత్ నటించిన బాషా మంచి పేరు తెచ్చింది. కన్నడ సినిమాల్లో 90 ‘s లో ఎంతో మంచి సినిమాల్లో కనిపించి స్టార్ హీరోగా ఎదిగారు . కన్నడ చిత్ర పరిశ్రమ శశి కుమార్ “సుప్రీం హీరో” అని పిలుస్తారు. ఇక ఈయన 2 డిసెంబర్ 1965 న జన్మించారు. శశి కుమార్ మొదటిసారి విడుదలైన చిత్రం రాఘవేంద్ర రాజ్‌కుమార్ నటించిన చిరంజీవి సుధాకర లో ఆయన నెగిటివ్ రోల్ లో కనిపించారు. 1989 లో అతను వి.రవిచంద్రన్, పూనమ్ ధిల్లాన్ నటించిన యుద్ధ కాండ తో మంచి పేరును తెచ్చుకున్నాడు. అలాగే ఆయన తెలుగులో కూడా కోకోరోకో చిత్రం ద్వారా పరిచయం అయ్యారు.ఇక ఆ తర్వాత తెలుగు సినిమాల్లో చిన్న వేషాలు వేసిన పెద్దగా గుర్తింపు రాకపోవడంతో అతను తన సొంత పరిశ్రమ వైపు మొగ్గు చూపాడు.

ఇప్పటికి ఈ హీరో ని మీరు గుర్తుపట్టలేకపోతే రజనీకాంత్ నటించిన బాషా సినిమా చూడాల్సిందే ఈ చిత్రంలో రజనీకాంత్ కి సోదరుడిగా ఆయన నటించాడు. కన్నడలో 1989 లో యుద్ధ కాండతో హీరోగా పరిచయం అయ్యి విజయం సాధించారు. కన్నడ సినిమా ఇండస్ట్రీ లో ఆల్ టైమ్ గ్రేట్ హిట్ పెయిర్ గా శశి కుమార్ మరియు మాలాశ్రీ ఉంటారు వీరిద్దరూ కలిసి అనేక హిట్ చిత్రాలలో నటించారు . సుధా రాణి , తారా వంటి ఇతర ప్రముఖ నటీమణులతో కూడా ఆయన జత కట్టారు. ఇకపోతే తెలుగులో విడుదలై విజయం సాధించిన సినిమాలను కన్నడలో డబ్ చేస్తూ పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగారు. 1990 ల మధ్యలో బెంగళూరు టర్ఫ్ క్లబ్ సమీపంలో డ్రైవింగ్ ప్రమాదానికి గురయ్యాడు. ఇక ఆయన కోలుకొని సమయానికి వివిధ సర్జరీల కారణముగా ఆయన శశి కుమార్ యేనా అన్నట్టుగా మారిపోయాడు. దింతో ఆయనకు పెద్దగా సినిమా ఆఫర్స్ రాలేదు.

ఇక ఆ సమయం లో అతను చిత్రదుర్గకు ప్రాతినిధ్యం వహిస్తున్న 13 వ లోక్ సభ సభ్యుడుగా జనతాదళ్ (యునైటెడ్) టికెట్‌పై పోటీ పడ్డాడు. చిత్రదుర్గ నియోజకవర్గానికి పార్లమెంటు ఎన్నికల్లో విజయవంతంగా పోటీ చేసి గెలిచారు . అయితే కొన్ని కారణాల వల్ల అతను 2006 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరాడు. దీంతో ఆయన అనేక పార్టీలు మారడంతో రాజకీయాల్లో కూడా ప్రజల మద్దతు కోల్పోయారు. అయితే రాజకీయాల్లో ప్రవేశించే ముందు తాను షెడ్యూల్ కులాల వ్యక్తిగా క్యాస్ట్ సర్టిఫికెట్ అందజేశారు. కానీ ఆయన క్షత్రియ కుటుంబానికి చెందిన వ్యక్తి అని, అతను బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అని ఆయనపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అలా ఈ హీరో రాజకీయ భవిష్యత్తు ముగిసింది. దింతో ఆయన మళ్ళీ చాలా రోజుల తర్వాత మల్టీస్టారర్ సినిమాల్లో నటించినా అతనికి ప్రజల నుండి పెద్దగా మద్దతు లభించలేదు. ఇలా మద్యం మత్తులో సినీ జీవితాన్ని, అలాగే పార్టీలు మారడం ద్వారా తన రాజకీయ జీవితానికి దూరం అయిపోయాడు. నిజంగా ఇది ఆయన స్వయంకృప అపరాధమే.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago