Categories: Movie News

శోభన తమ్ముడు ఈ పెద్ద సినిమాల హీరో అని మీకు తెలుసా..

ద‌క్షిణాదిన ఉన్న అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జాతీయ ఉత్తమ నటి శోభన. విలక్షణ నటి, ప్రముఖ నృత్యకారిణి శోభన తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ చిత్ర రంగాలకు సుపరిచితులు. సినీ పరిశ్రమలో చాలా సీనియర్ నటి. సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్న శోభన ప్రస్తుతం చెన్నైలో కలర్పణ పేరు డాన్సింగ్ స్కూల్ నిర్వహిస్తున్నది. నాగార్జున తొలి చిత్రం 1985 ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్‌తో, మోహన్ బాబుతో అల్లుడుగారు, రౌడీగారు ఇలా పలు సినిమాల్లో నటించింది. తెలుగుతోపాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. చంద్రముఖి చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణిచిత్రతాజులో అద్భుతంగా నటించి అవార్డు పొందింది. సుమారు 200లకు పైగా చిత్రాల్లో నటించిన శోభన ఎందుకనో పెళ్లిపై దృష్టి సారించలేదు. స్థానిక అడయార్‌లో శిష్య స్కూల్‌ పేరుతో నాట్య పాఠశాలను నెలకొల్పి అధిక సమయాన్ని నృత్య శిక్షణలోనే గడిపేస్తున్నారు. నృత్య ప్రదర్శనలపై ఎక్కువ మక్కువ చూపుతున్న శోభన 2001లో అనంతనారాయణి అనే పాపను దత్తత తీసుకున్నారు. అలా పెళ్లి చేసుకోరాదని భావించిన శోభన అనూహ్యంగా ఇప్పుడు తనకు ఒక తోడును వెతుక్కున్నట్లు ప్రచారం జరిగింది. ఆమె సన్నిహితులు మాత్రం శోభన త్వరలో పెళ్లి చేసుకోనున్నారని అంటున్నారు. శోభన ఫ్యామిలి లో చాల మంది నటి నటులు ఉన్నారు అని చాల మందికి తెలియదు, వాళ్ళు ఎవరో ఇప్పుడు చూదాం,

వినీత్

శోభన కి హీరో వినీత్ కజిన్ అని ఇప్పటి వరకు చాల మందికి తెలియదు. వినీత్ తెలుగు, తమిళం,కన్నడ మళయాల మరియు హిందీ భాషలలో పలు సినిమాలలో నటించాడు. తెలుగులో అబ్బాస్ తో కలిసి నటించిన ప్రేమ దేశం సినిమా ఇతనికి మంచిపేరు తెచ్చింది. వినీత్ 6 ఏళ్ళ వయసులోనే భరతనాట్యం నేర్చుకున్నాడు. నాలుగు సంవత్సరాలపాటు కేరళ స్టేట్ యూత్ ఫెస్టివల్లో మొదటి బహుమతిని గెలుపొందడంతోపాటు, పాఠశాలలో చదువుతున్న సమయంలో భరతనాట్యం నృత్య రూపంలో అనేక బహుమతులు గెలుచుకున్ననటుడు. సినిమాల్లో విజయం సాధించినప్పటికీ, నృత్యంగా అతను తన భరతనాట్యంతో ప్రపంచవ్యాప్తంగా అనేక నృత్య కార్యక్రమాలలోనూ పాల్గొన్నాడు. వినీత్ Priscilla Menon ను వివాహం చేసుకుని చెన్నైలో స్థిరపడ్డారు. వారికి అవంతి వినీత్ అనే కుమార్తె ఉంది. ప్రసిద్ధ ట్రావెన్కోర్ సోదరీమణుల నటి పద్మిని భర్త డాక్టర్ రామచంద్రన్ కి మేనల్లుడు. మలయాళం యాక్టర్ కృష్ణ , బాలీవుడ్ నటి సుకుమారి మరియు అంబికా సుకుమారన్ లకి కూడా వినీత్ బంధువు. 

సుకుమారి 


పదో ఏటనే నటన మొదలుపెట్టిన సుకుమారి తెలుగు , మలయాళం, ఓడిశా , బెంగాల్, భాషల్లో దాదాపుగా ఆమె 2500 చిత్రాలలో నటించింది . ఆమెను 2003 లో ప్రభుత్వం పద్మశ్రీ అవార్డ్ తో సత్కరించగా, 2010 లో ఉత్తమ సహాయనటిగా అవార్డ్ దక్కించుకుంది. బాల నటిగా అనేక చిత్రాలలో నటించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై రచించిన ఓర్ ఇరువు చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ‘నిర్ణయం’, ‘మాంగల్యబలం’ వంటి సినిమాలు తెలుగులో ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. అంతే కాక మహేష్ హీరోగా నటించిన ‘మురారి’ చిత్రంలో బామ్మ (శబరీ) పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చిన్న నాటి నుండి నృత్యం మరియు రంగస్థల ప్రధర్శనలలో ఆసక్తి చూపేవారు. శోభన ఈమె మేనకోడలు. దర్శకుడు ఎ.భీంసింగ్ ను వివాహము చేసుకున్నారు. వీరికి డాక్టర్ సురేశ్ సింగ్ సంతానము. ఇంటిలో పూజ చేస్తుండగా చీరకు నిప్పు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 26 మార్చి 2013 న తుది శ్వాస వదిలారు.

పద్మిని 

పద్మిని  మరియు ఈమె సోదరీమణులు లలిత, రాగిణి ముగ్గురూ కలిసి ట్రావన్‌కోర్ సిస్టర్స్గా ప్రసిద్ధి చెందారు. ఈమె 1932, జూన్ 12వ తేదీన జన్మించింది. ఈమె తొలిసారి తన 14వయేట కల్పన అనే హిందీ సినిమాలో నర్తకిగా నటించింది. తరువాత 30 సంవత్సరాలు తెలుగు, తమిళ, హిందీ, మళయాల భాషలలో సుమారు 250 సినిమాలలో నటించింది. ఈమె శివాజీ గణేశన్, ఎం.జి.రామచంద్రన్, ఎన్.టి.రామారావు, రాజ్‌ కపూర్, షమ్మీ కపూర్, ప్రేమ్‌ నజీర్, రాజ్‌కుమార్, జెమినీ గణేశన్ వంటి పెద్ద నటులతో కలిసి నటించింది. ఎక్కువగా శివాజీ గణేశన్‌తో 59 చిత్రాలలో నటించింది. ఈమె అమెరికాలో స్థిరపడిన రామచంద్రన్ అనే డాక్టరును 1961లో వివాహం చేసుకుని తాత్కాలికంగా నటనకు విరామం ఇచ్చి కుటుంబ జీవితంపై, భరతనాట్యంపై దృష్టిని కేంద్రీకరించింది. 1977లో న్యూ జెర్సీలో శాస్త్రీయ నృత్యశిక్షణ కొరకు పద్మిని స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే పేరుతో ఒక డ్యాన్స్ స్కూలును ప్రారంభించింది. ప్రస్తుతం ఈ స్కూలు అమెరికాలోని భారత శాస్త్రీయ నృత్య శిక్షణా సంస్థలలో అతి పెద్దదిగా పేరుపొందింది. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు. ఈమె చెన్నై లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2006, సెప్టెంబరు 24 తేదీన గుండెపోటుతో మరణించింది. 

రాగిణి 

ఈమె తెలుగు, మలయాళం, తమిళ, హిందీ చిత్రాలలో నటించింది. అనేక నాటకాలలో కూడా నటించింది. ఈమె అక్కలు లలిత, పద్మినిలు కూడా నర్తకులుగా, సినీనటులుగా రాణించారు. ఈమె తన సోదరీమణులతో కలిసి వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంది. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు. ఈమె మాధవన్ థంపిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు లక్ష్మి, ప్రియ అనే కుమార్తెలు కలిగారు. ఈమె భర్త ఈమెను వదిలి 1974లో అమెరికా వెళ్ళాడు. కానీ ఈమె కేన్సర్‌ బారిన పడ్డ తరువాత తిరిగి వచ్చాడు. ఈమె బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతూ 1976లో మృతిచిందింది.

లలిత 

ఈమె 1938లో అదిథన్ కనవు అనే తమిళ చిత్రంద్వరా సినిమా రంగప్రవేశం చేసింది. ఈమె తెలుగు, మళయాలం, తమిళ, హిందీ చిత్రాలలో నటించింది. ఈమె చెల్లెళ్లు పద్మిని, రాగిణులు కూడా నర్తకులుగా, సినీనటులుగా రాణించారు. ఈమె తన సోదరీమణులతో కలిసి వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంది. లలిత తన సోదరీమణులకంటే ముందుగా సినిమా రంగంలో ప్రవేశించింది. ఎక్కువగా మలయాళ సినిమాలలో నటించి వ్యాంపు పాత్రలలో ఎక్కువ పేరు సంపాదించింది. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు. ఈమె 1983లో మృతి చెందింది.

వీళ్ళే కాదు మలయాళం నటి అంబికా సుకుమారన్ , మలయాళం యాక్టర్ కృష్ణ కూడా వీళ్ళ రిలేటివ్స్, ఇలా చూసుకుంటే పోతే వీళ్ళ ఫ్యామిలీ లో చాల మందే సినీ నటి నటులు ఉన్నారు. శోభన ఫ్యామిలీ లో ఇంత మంది నటులు ఉన్నారు అని ఇప్పటికి చాల మందికి తెలియదు. 

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago