Connect with us

Movie News

శోభన తమ్ముడు ఈ పెద్ద సినిమాల హీరో అని మీకు తెలుసా..

Published

on

ద‌క్షిణాదిన ఉన్న అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జాతీయ ఉత్తమ నటి శోభన. విలక్షణ నటి, ప్రముఖ నృత్యకారిణి శోభన తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ చిత్ర రంగాలకు సుపరిచితులు. సినీ పరిశ్రమలో చాలా సీనియర్ నటి. సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్న శోభన ప్రస్తుతం చెన్నైలో కలర్పణ పేరు డాన్సింగ్ స్కూల్ నిర్వహిస్తున్నది. నాగార్జున తొలి చిత్రం 1985 ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్‌తో, మోహన్ బాబుతో అల్లుడుగారు, రౌడీగారు ఇలా పలు సినిమాల్లో నటించింది. తెలుగుతోపాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. చంద్రముఖి చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణిచిత్రతాజులో అద్భుతంగా నటించి అవార్డు పొందింది. సుమారు 200లకు పైగా చిత్రాల్లో నటించిన శోభన ఎందుకనో పెళ్లిపై దృష్టి సారించలేదు. స్థానిక అడయార్‌లో శిష్య స్కూల్‌ పేరుతో నాట్య పాఠశాలను నెలకొల్పి అధిక సమయాన్ని నృత్య శిక్షణలోనే గడిపేస్తున్నారు. నృత్య ప్రదర్శనలపై ఎక్కువ మక్కువ చూపుతున్న శోభన 2001లో అనంతనారాయణి అనే పాపను దత్తత తీసుకున్నారు. అలా పెళ్లి చేసుకోరాదని భావించిన శోభన అనూహ్యంగా ఇప్పుడు తనకు ఒక తోడును వెతుక్కున్నట్లు ప్రచారం జరిగింది. ఆమె సన్నిహితులు మాత్రం శోభన త్వరలో పెళ్లి చేసుకోనున్నారని అంటున్నారు. శోభన ఫ్యామిలి లో చాల మంది నటి నటులు ఉన్నారు అని చాల మందికి తెలియదు, వాళ్ళు ఎవరో ఇప్పుడు చూదాం,

వినీత్

శోభన కి హీరో వినీత్ కజిన్ అని ఇప్పటి వరకు చాల మందికి తెలియదు. వినీత్ తెలుగు, తమిళం,కన్నడ మళయాల మరియు హిందీ భాషలలో పలు సినిమాలలో నటించాడు. తెలుగులో అబ్బాస్ తో కలిసి నటించిన ప్రేమ దేశం సినిమా ఇతనికి మంచిపేరు తెచ్చింది. వినీత్ 6 ఏళ్ళ వయసులోనే భరతనాట్యం నేర్చుకున్నాడు. నాలుగు సంవత్సరాలపాటు కేరళ స్టేట్ యూత్ ఫెస్టివల్లో మొదటి బహుమతిని గెలుపొందడంతోపాటు, పాఠశాలలో చదువుతున్న సమయంలో భరతనాట్యం నృత్య రూపంలో అనేక బహుమతులు గెలుచుకున్ననటుడు. సినిమాల్లో విజయం సాధించినప్పటికీ, నృత్యంగా అతను తన భరతనాట్యంతో ప్రపంచవ్యాప్తంగా అనేక నృత్య కార్యక్రమాలలోనూ పాల్గొన్నాడు. వినీత్ Priscilla Menon ను వివాహం చేసుకుని చెన్నైలో స్థిరపడ్డారు. వారికి అవంతి వినీత్ అనే కుమార్తె ఉంది. ప్రసిద్ధ ట్రావెన్కోర్ సోదరీమణుల నటి పద్మిని భర్త డాక్టర్ రామచంద్రన్ కి మేనల్లుడు. మలయాళం యాక్టర్ కృష్ణ , బాలీవుడ్ నటి సుకుమారి మరియు అంబికా సుకుమారన్ లకి కూడా వినీత్ బంధువు. 

Advertisement

సుకుమారి 


పదో ఏటనే నటన మొదలుపెట్టిన సుకుమారి తెలుగు , మలయాళం, ఓడిశా , బెంగాల్, భాషల్లో దాదాపుగా ఆమె 2500 చిత్రాలలో నటించింది . ఆమెను 2003 లో ప్రభుత్వం పద్మశ్రీ అవార్డ్ తో సత్కరించగా, 2010 లో ఉత్తమ సహాయనటిగా అవార్డ్ దక్కించుకుంది. బాల నటిగా అనేక చిత్రాలలో నటించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై రచించిన ఓర్ ఇరువు చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ‘నిర్ణయం’, ‘మాంగల్యబలం’ వంటి సినిమాలు తెలుగులో ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. అంతే కాక మహేష్ హీరోగా నటించిన ‘మురారి’ చిత్రంలో బామ్మ (శబరీ) పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చిన్న నాటి నుండి నృత్యం మరియు రంగస్థల ప్రధర్శనలలో ఆసక్తి చూపేవారు. శోభన ఈమె మేనకోడలు. దర్శకుడు ఎ.భీంసింగ్ ను వివాహము చేసుకున్నారు. వీరికి డాక్టర్ సురేశ్ సింగ్ సంతానము. ఇంటిలో పూజ చేస్తుండగా చీరకు నిప్పు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 26 మార్చి 2013 న తుది శ్వాస వదిలారు.

పద్మిని 

పద్మిని  మరియు ఈమె సోదరీమణులు లలిత, రాగిణి ముగ్గురూ కలిసి ట్రావన్‌కోర్ సిస్టర్స్గా ప్రసిద్ధి చెందారు. ఈమె 1932, జూన్ 12వ తేదీన జన్మించింది. ఈమె తొలిసారి తన 14వయేట కల్పన అనే హిందీ సినిమాలో నర్తకిగా నటించింది. తరువాత 30 సంవత్సరాలు తెలుగు, తమిళ, హిందీ, మళయాల భాషలలో సుమారు 250 సినిమాలలో నటించింది. ఈమె శివాజీ గణేశన్, ఎం.జి.రామచంద్రన్, ఎన్.టి.రామారావు, రాజ్‌ కపూర్, షమ్మీ కపూర్, ప్రేమ్‌ నజీర్, రాజ్‌కుమార్, జెమినీ గణేశన్ వంటి పెద్ద నటులతో కలిసి నటించింది. ఎక్కువగా శివాజీ గణేశన్‌తో 59 చిత్రాలలో నటించింది. ఈమె అమెరికాలో స్థిరపడిన రామచంద్రన్ అనే డాక్టరును 1961లో వివాహం చేసుకుని తాత్కాలికంగా నటనకు విరామం ఇచ్చి కుటుంబ జీవితంపై, భరతనాట్యంపై దృష్టిని కేంద్రీకరించింది. 1977లో న్యూ జెర్సీలో శాస్త్రీయ నృత్యశిక్షణ కొరకు పద్మిని స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే పేరుతో ఒక డ్యాన్స్ స్కూలును ప్రారంభించింది. ప్రస్తుతం ఈ స్కూలు అమెరికాలోని భారత శాస్త్రీయ నృత్య శిక్షణా సంస్థలలో అతి పెద్దదిగా పేరుపొందింది. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు. ఈమె చెన్నై లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2006, సెప్టెంబరు 24 తేదీన గుండెపోటుతో మరణించింది. 

రాగిణి 

ఈమె తెలుగు, మలయాళం, తమిళ, హిందీ చిత్రాలలో నటించింది. అనేక నాటకాలలో కూడా నటించింది. ఈమె అక్కలు లలిత, పద్మినిలు కూడా నర్తకులుగా, సినీనటులుగా రాణించారు. ఈమె తన సోదరీమణులతో కలిసి వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంది. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు. ఈమె మాధవన్ థంపిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు లక్ష్మి, ప్రియ అనే కుమార్తెలు కలిగారు. ఈమె భర్త ఈమెను వదిలి 1974లో అమెరికా వెళ్ళాడు. కానీ ఈమె కేన్సర్‌ బారిన పడ్డ తరువాత తిరిగి వచ్చాడు. ఈమె బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతూ 1976లో మృతిచిందింది.

Advertisement

లలిత 

ఈమె 1938లో అదిథన్ కనవు అనే తమిళ చిత్రంద్వరా సినిమా రంగప్రవేశం చేసింది. ఈమె తెలుగు, మళయాలం, తమిళ, హిందీ చిత్రాలలో నటించింది. ఈమె చెల్లెళ్లు పద్మిని, రాగిణులు కూడా నర్తకులుగా, సినీనటులుగా రాణించారు. ఈమె తన సోదరీమణులతో కలిసి వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంది. లలిత తన సోదరీమణులకంటే ముందుగా సినిమా రంగంలో ప్రవేశించింది. ఎక్కువగా మలయాళ సినిమాలలో నటించి వ్యాంపు పాత్రలలో ఎక్కువ పేరు సంపాదించింది. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు. ఈమె 1983లో మృతి చెందింది.

వీళ్ళే కాదు మలయాళం నటి అంబికా సుకుమారన్ , మలయాళం యాక్టర్ కృష్ణ కూడా వీళ్ళ రిలేటివ్స్, ఇలా చూసుకుంటే పోతే వీళ్ళ ఫ్యామిలీ లో చాల మందే సినీ నటి నటులు ఉన్నారు. శోభన ఫ్యామిలీ లో ఇంత మంది నటులు ఉన్నారు అని ఇప్పటికి చాల మందికి తెలియదు. 

Advertisement
Continue Reading
Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!