టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్ర దర్శకుడిగా వెలిగాడు శ్రీను వైట్ల. కెరీర్ ప్రారంభంలో చిన్న హీరోలతో సినిమా తీసిన ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, మాస్ మహారాజ రవితేజ, సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేశ్ లాంటి స్టార్స్‌తో పెద్ద నిర్మాణ సంస్థలలో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్..ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నాడు. అయితే శ్రీనువైట్ల ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం మాత్రం అక్కినేని నాగార్జున. ఆయన ఇచ్చిన సలహా..టాలీవుడ్‌లో ఈ దర్శకుడిని అగ్ర తాంబూలం అందుకునేలా చేసింది. ఒక దశలో ఈ డైరెక్టర్‌కి నిర్మాతలు భారీగా అడ్వాన్సులు ఇచ్చేవారు. అలాంటిది ఒక్కసారిగా కెరీర్ డైలమాలో పడింది.
శ్రీను వైట్ల ఇండస్ట్రీలోకి రావడం ఒక మిరాకిల్ అని చెప్పాలి. ఆయన తూర్పుగోదావరి జిల్లాకి చెందినవాడు. అక్కడే ఉండే ఓ డిస్టిబ్యూటర్ ద్వారా గోగినేని సుబ్బారావు అనే నిర్మాత పరిచయమయ్యాడు. ఆయన చిన్ని కృష్ణుడు, పడమటి సంధ్యారాగం అనే సినిమాల నిర్మాణంలో పార్టనర్. ఆయన శ్రీను వైట్లకి సినిమాల మీద ఉన్న ఆసక్తి తెలుసుకుని చలసాని రామారావు అనే డైరెక్టర్ కి పరిచయం చేశారు. చలసాని రామారావు.. నట సింహం నందమూరి బాలకృష్ణతో ‘ప్రాణానికి ప్రాణం’ అనే సినిమా తీస్తున్నారు.
ఆ సినిమాకి చలసాని రామారావు వద్ద అప్రెంటీస్ గా చేరాడు. ఇలా శ్రీను వైట్ల 1989 లో సినిమా రంగంలో అడుగుపెట్టాడు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్. ఆ తర్వాత శివ సినిమాతో రాంగోపాల్ వర్మ పేరు అంతటా మార్మోగిపోయింది. దాంతో వర్మ దగ్గర అసిస్టెంట్ గా చేరదామని శ్రీను వైట్ల హైదరాబాదు వచ్చాడు. కాని వర్మ వద్ద అప్పటికే అసిస్టెంటుగా చేరడానికి వచ్చిన వాళ్ళ క్యూ చాలా పెద్దగా ఉండింది. దాంతో ముందు ప్రాణానికి ప్రాణం సినిమా సమయంలో పరిచయమైన డైరెక్టర్ సాగర్ వద్ద అసిస్టెంట్ గా చేరాడు. అలా ‘నక్షత్రపోరాటం’ అనే సినిమాకి పని చేశాడు.
అలా సాగర్ గారి వద్ద సూపర్ స్టార్ కృష్ణ నటించిన అమ్మదొంగా సినిమా వరకూ పనిచేశాడు. ఈ సినిమా తరువాత శ్రీను వైట్ల సొంతంగా డైరెక్షన్ చేయాలని డిసైడయ్యాడు. ఈ నేపథ్యంలో కథలు తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు. అలా రవితేజ – మహేశ్వరీ జంటగా నీకోసం సినిమా మొదలు పెట్టాడు. కానీ ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచీ అన్నీ కష్టాలే. నిర్మాతలు తలా ఒక రెండు, మూడు లక్షలు వేసుకుని ప్రాజెక్టు మొదలెట్టారు, కానీ మధ్యలో బడ్జెట్ అయిపోవడంతో శ్రీను వైట్లనే కొంత పెట్టుబడి పెట్టాడు. అలా నానా కష్టాలూ పడి ‘నీకోసం’ సినిమాని పూర్తిచేశాడు.
కేవలం 38 లక్షల్లో 28 వర్కింగ్ డేస్ లో తీసిన సినిమా పూర్తి కావడానికి మొత్తం సంవత్సరంన్నర పట్టింది. ఈ సినిమా ప్రివ్యూ చూసిన నాగార్జున..శ్రీను వైట్లకి దర్శకుడిగా అవకాశం ఇస్తానని ప్రామిస్ చేశాడు. అయితే మంచి కామెడీ ట్రాక్ ఉంటే నీ సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయని సలాహా ఇచ్చారు. ‘నీకోసం’ సినిమాకి సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ అందించిన సాంగ్స్ పెద్ద హిట్. టైటిల్ సాంగ్ అయితే ఇప్పటికీ వినిపిస్తుంది. అలా ఆ తర్వాత నుంచి శ్రీను వైట్ల నాగార్జున చెప్పినట్టు హెల్దీ కామెడీ ట్రాక్ పెడూతూ వచ్చి స్టార్ డైరెక్టర్ అయ్యాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…