Featured

అంజి దొరికాడంటూ నాటకమాడిన దీప… పార్టీ చేసుకుంటున్న మోనిత.!

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు 1106 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. గత ఎపిసోడ్ లో భాగంగా దీప మోనిత ఏసీపీ ఇంటికి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. అక్కడ ఏసీపీ రోషిని మోనితను అంజి ఎవరు? అతనితో నీకు ఉన్న సంబంధం ఏమిటి? అంజిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావా? అనే ప్రశ్నలు అడుగుతూ కంగారు పెట్టేస్తుంది. ఇంత రసవత్తరంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో నేటి ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో… ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాం..

ఏసీపీ ఇంటికి వెళ్ళిన దీప,మోనితను రోషిని వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ కంగారు పెట్టేస్తుంది. ఈ క్రమంలోనే హిమ ఎవరు? హిమ నీకు తెలుసా? హిమ ఎలా చనిపోయింది అంటూ ప్రశ్నలు కురిపించారు. హిమ కు నీకు ఏమైనా పగ ఉందా? అని రోషిని ప్రశ్నించగా అందుకు..మోనిత ఏమీ లేదు అని సమాధానం చెబుతుంది. ఇంతలో దీప కలుగజేసుకొని ఆరోజు నడిరోడ్డులో నా ఫోన్, అంజి ఫోన్ ఎందుకు పగలగొట్టావ్.. మేమిద్దరం రోడ్డుపై మాట్లాడుకుంటే నువ్వెందుకు కంగారు పడ్డావు అంటూ నిలదీస్తుంది. దీప మాటలకు సమాధానం చెబుతూ.. అంజిని చూసి నేను ఎందుకు భయపడతాను. నువ్వు ఒక డాక్టర్ భార్యవి అలా డ్రైవర్ తో రోడ్డుపై మాట్లాడితే నాకు నచ్చలేదు అందుకే హెచ్చరించానని మోనిత సమాధానం చెబుతుంది.

ఈ విధంగా వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటే ఏసీపీ జోక్యం చేసుకుని ఇంతకు హిమ ఎవరు దీప అని రోషిని అడగటంతో.. హిమ మా ఆయన ప్రేమించిన వ్యక్తి. అందుకే మా పాపకు ఆ పేరే పెట్టాము. హిమ నీకు తెలుసా అని అడగడంతో మోనిత… నేను ,కార్తీక్, హిమ ముగ్గురం కలిసి చదువుకున్నాం. హిమ ఆక్సిడెంట్ లో చనిపోయింది. తనని నేనే అంజి చేత యాక్సిడెంట్ చేయించి చంపానని దీప నాపై నింద మోపుతోంది. హిమ కు యాక్సిడెంట్ చేస్తే ఆ కారులో కార్తీక్ కూడా ఉన్నాడు. కార్తీక్ ను ఎందుకు చంపించాలని అనుకుంటాను అంటూ
మోనిత సమాధానం చెబుతుంది. హిమను చంపించడానికి కంటే ముందుగా నువ్వు కార్తీక్ ను ప్రేమించావా? అని అడగడంతో అవునని సమాధానం చెబుతుంది మోనిత. ఈ మాట విన్న ఏసిపి ఇక నువ్వు వెళ్ళవచ్చు అనడంతో నన్ను వెళ్ళమని చెప్పిన ఏసిపి దీపతో మాట్లాడుతోంది అని కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్తుంది.

ఇక మోనిత బయటకు వెళ్లగానే ఏసీపీతో దీప మాట్లాడుతూ…మోనితను పిలిపించారు అంటే అంజి ఆచూకీ దొరికిందా మేడం అని అడగడంతో ఆ మాటలు విన్న మోనిత అంటే రిజిస్టర్ ప్రసాద్ కి ఫోన్ చేసి పెళ్లికి అభ్యంతరం చెప్పింది అంజి కాదా… ఇదంతా దీప ఆడుతున్న నాటకమా.. ?ఒసేయ్ దీప ఇంత నాటకం ఆడతావా.. ?చూస్తా.. నీ అంతు చూస్తా అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక అంజి దొరకలేదన్న ఆనందంతో మోనిత ఇంటికి వెళ్లి చికెన్ బిర్యాని తింటూ పార్టీ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే దీప కార్తీక్ అక్కడికి వెళ్లి ఆమెకు షాక్ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది తరువాత ఎపిసోడ్ లో చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago