టాలివుడ్ లో ‘సమంత’ పేరు తెలియని వారు ఉండరేమో. అంతగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ఏమాయ చేసావే సినిమాతో టాలివుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. తన అందంతో యువతకు నిద్ర లేకుండా చేశారు. మొదటి సినిమాతోనే అక్కినేని నాగ చైతన్యను ప్రేమించింది. అంతే కాకుండా పెళ్లి కూడా చేసుకుంది. సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా ఆమె చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఏ చిన్న సంఘటనకు సంబంధించి అయినా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఓ వైపు వైవాహిక జీవితాన్ని.. మరోవైపు సినీ జీవితాన్ని రెండూ సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఇంతవరకు అందరికీ తెలిసిందే. పెళ్లి జరిగిన కొన్ని రోజులకు “సమంత అక్కినేనిగా” తన పేరును మార్చుకున్న సమంత.. ఇప్పుడు సడన్ గా తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో ‘అక్కినేని’ పేరు తీసివేయడం చర్చనీయాంశంగా మారింది.
సమంత ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్ ల ప్రొఫైల్ నేమ్ ఈ రోజు వరకు కూడా ‘సమంత అక్కినేని’ అని ఉండేది. అయితే ఇప్పుడు ఆ పేరు స్థానంలో ‘S’ అనే సింగిల్ లెటర్ మాత్రమే కనిపిస్తోంది. ఇది అందరిలో అనేక సందేహాలను రేకెత్తించేలా చేసింది. సడన్ గా ఇలా సమంత ఎందుకు చేశారనే సందేహం అభిమానులకు కులుగుతోంది.
దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంభాషణలు జరుగుతున్నాయి. ఆమె ఏదైనా ప్రచారంలో భాగంగా ఇలా చేసి ఉంటారని కొందరు అంటుంటే.. మరి కొంత మంది వివిధ కారణాలను చెబుతున్నారు. మరి సమంత ఇలా మార్చడానికి గల కారణం ఏంటనే విషయాన్ని ఆమె వెల్లడించే వరకు ఈ డిస్కషన్స్ ఆగవేమో. చూద్దాం.. మరి సమంత ఎలా రియాక్ట్ అవుతారో.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…