General News

చెట్లకు దేవుడి ఫోటోలు అతికిస్తున్న వ్యక్తి.. ఎందుకంటే?

సాధారణంగా మనం దేవుళ్ళ ఫోటోలను మన ఇంట్లోనో లేదా దేవాలయంలోనో ఉండటం చూస్తుంటాము. కానీ ఈ వ్యక్తి మాత్రం చెట్లు కనబడితే చాలు వాటికి దేవుళ్ళ ఫోటోలను అతికిస్తాడు. అదేంటని ఎవరైనా అడిగితే చాలు.. వారి చేతికి కూడా కొన్ని దేవుళ్ళ ఫోటోలు ఇచ్చి చెట్లకు అతికించమ చెబుతాడు. ఇతను చెట్లకు ఈ విధంగా దేవుళ్ళ ఫోటోలు అతికించడానికి కారణం తెలిస్తే ఎవరైనా అతని ఆలోచనా ధోరణిని ప్రశంసిస్తారు. ఇంతకీ అతను చెట్లకు దేవుడి ఫోటోలను అతికించడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

దేవుడి ఫోటోలను చెట్లకు ఎందుకు అతికిస్తున్నావని ఎవరైనా అడిగితే.. పర్యావరణ పరిరక్షణ కోసం అని సమాధానం చెబుతాడు.ఈ విధంగా పర్యావరణాన్ని కాపాడే ఈ చెట్లకు దేవుడి ఫోటోలు అతికించడం వల్ల ఎవరు కూడా చెట్లు నరకడానికి ముందుకు రారు. మన ప్రాణాలను రక్షించే దేవుడు మనకు ఎంత ముఖ్యమో ఈ పర్యావరణాన్ని రక్షించే చెట్లు కూడా దేవుడితో సమానం అని సమాధానం చెబుతాడు.

అలాగే చెట్లకు ఫోటోలు అతికించడం వెనుక మరొక కారణం కూడా ఉంది.పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ బలోడ్ జిల్లాలోని తరౌడ్ నుంచి దైహాన్ వరకు 8 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు.ఈ క్రమంలోనే ఆ మార్గమధ్యం కుండా ఉన్నటువంటి సుమారు2,900 చెట్లను తొలగించనున్నారు.

ఈ విధంగా చెట్లను తొలగించడం వల్ల పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని, పర్యావరణాన్ని కాపాడటం ఎంతో ముఖ్యమని అందుకోసమే తనవంతుగా పర్యావరణాన్ని కాపాడడం కోసం ఇలా చేస్తున్నానని విరేంద్ర సింగ్ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago