సాధారణంగా మనం దేవుళ్ళ ఫోటోలను మన ఇంట్లోనో లేదా దేవాలయంలోనో ఉండటం చూస్తుంటాము. కానీ ఈ వ్యక్తి మాత్రం చెట్లు కనబడితే చాలు వాటికి దేవుళ్ళ ఫోటోలను అతికిస్తాడు. అదేంటని ఎవరైనా అడిగితే చాలు.. వారి చేతికి కూడా కొన్ని దేవుళ్ళ ఫోటోలు ఇచ్చి చెట్లకు అతికించమ చెబుతాడు. ఇతను చెట్లకు ఈ విధంగా దేవుళ్ళ ఫోటోలు అతికించడానికి కారణం తెలిస్తే ఎవరైనా అతని ఆలోచనా ధోరణిని ప్రశంసిస్తారు. ఇంతకీ అతను చెట్లకు దేవుడి ఫోటోలను అతికించడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

దేవుడి ఫోటోలను చెట్లకు ఎందుకు అతికిస్తున్నావని ఎవరైనా అడిగితే.. పర్యావరణ పరిరక్షణ కోసం అని సమాధానం చెబుతాడు.ఈ విధంగా పర్యావరణాన్ని కాపాడే ఈ చెట్లకు దేవుడి ఫోటోలు అతికించడం వల్ల ఎవరు కూడా చెట్లు నరకడానికి ముందుకు రారు. మన ప్రాణాలను రక్షించే దేవుడు మనకు ఎంత ముఖ్యమో ఈ పర్యావరణాన్ని రక్షించే చెట్లు కూడా దేవుడితో సమానం అని సమాధానం చెబుతాడు.
అలాగే చెట్లకు ఫోటోలు అతికించడం వెనుక మరొక కారణం కూడా ఉంది.పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ బలోడ్ జిల్లాలోని తరౌడ్ నుంచి దైహాన్ వరకు 8 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు.ఈ క్రమంలోనే ఆ మార్గమధ్యం కుండా ఉన్నటువంటి సుమారు2,900 చెట్లను తొలగించనున్నారు.
ఈ విధంగా చెట్లను తొలగించడం వల్ల పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని, పర్యావరణాన్ని కాపాడటం ఎంతో ముఖ్యమని అందుకోసమే తనవంతుగా పర్యావరణాన్ని కాపాడడం కోసం ఇలా చేస్తున్నానని విరేంద్ర సింగ్ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



























