General News

షూటింగ్స్ లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. ఆ సమయంలో శ్రీముఖి సాయం.. : అవినాష్

ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై ఎంతో మంది కమెడియన్స్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్ ద్వారా ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. అయితే వీరందరికీ ఇండస్ట్రీలో అవకాశాలను కల్పించింది మాత్రం జబర్దస్త్ కార్యక్రమం అని చెప్పవచ్చు. ఈ జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీలోకి వచ్చి అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రస్తుతం ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈ విధంగా కెరియర్లో ముక్కు అవినాష్ ఒకరిని చెప్పవచ్చు.

మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన అవినాష్ ఆ తర్వాత జబర్దస్త్ కార్యక్రమంలో కి వచ్చి తనదైన శైలిలో గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో అవకాశాలు వస్తున్నప్పటికీ జబర్దస్త్ వదలకుండా అందులోనే కొనసాగాడు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ అవకాశం రావడంతో జబర్దస్త్ వదిలి బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత అవినాష్ వరుస కార్యక్రమాలలో చేస్తూ మంచి గుర్తింపు పొందారు.

ఈ క్రమంలోనే స్టార్ మాలో ప్రసారం అవుతున్న “కామెడీ స్టార్స్” కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం ముక్కు అవినాష్ తనదైన శైలిలో సందడి చేశారు. ఈ ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీముఖి, ఆర్జే చైతూ, విష్ణుప్రియ స్పెషల్ గెస్టులుగా వచ్చారు. ఈ షోలో భాగంగా ముక్కు అవినాష్ శ్రీముఖి గెటప్ లో కనిపించే సందడి చేస్తూ.. శ్రీముఖి క్యారెక్టర్ బయటపెట్టాడు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ… షూటింగులు లేక అమ్మానాన్నలకు ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. ఆ సమయంలో చేతిలో డబ్బులు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. అప్పుడే బిగ్ బాస్ ఆఫర్ రావడం 10 లక్షలు కట్టడం జరిగిపోయింది. అయితే అలాంటి సమయంలో నేను ఎవరిని డబ్బులు అడగలేదు కానీ, శ్రీముఖి నా కష్టాలు తెలుసుకొని డబ్బులు ఇచ్చిందంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా అవినాష్ శ్రీముఖికి దండం పెట్టాడు. ఇలా శ్రీముఖి గెటప్ లో అవినాష్ శ్రీముఖి అసలు వ్యక్తిత్వాన్ని బయటపెట్టాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago