Featured

షూటింగ్ మధ్యలో ఆగిపోయిన కథతో దాసరి బ్లాక్ బస్టర్ సినిమా తీసారని మీకు తెలుసా..!!

దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యులైన కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి, రేలంగి నరసింహారావు లాంటి శిష్యుల్లో ఒకరాయన. కాకపోతే మిగతా శిష్యులతో పోలిస్తే ఈయన ఎంచుకున్న జోనర్ వేరు.ఆయన తీసిన సినిమాలన్నీ విప్లవాత్మక ధోరణిలో ఉండేవి.కార్మికుల కష్టాలు, పేదవారి ఆకలి, ఆక్రందనలే ఆయన ప్రధాన కథ. సినిమా అంటే వినోదం మాత్రమే కాదు, సామాజిక సందేశం, సమాజ మార్పు అనేది గట్టిగా నమ్మిన దర్శకుడు. ఆయన జీవితంలో ఎదురైన, స్వయంగా చూసిన సామాజిక స్థితిగతులను దృశ్య రూపకంగా మలచి నిలువుటద్దంలా ప్రేక్షకుల ముందు ఉంచారు.

పశ్చిమగోదావరి, నరసాపురంలో జన్మించిన ధవళ సత్యం. సినిమాల్లోకి రాకముందు ఆయన ప్రజానాట్య మండలిలో పనిచేశారు.జనసంద్రంలో తాను ఒక ఇసుకరేణువుగ భావించి భావిభారత పునర్నిర్మాణానికి తనవంతు కృషిగా సామాజిక మార్పుకోసం అనేక నాటకాలను ప్రదర్శించారు. సత్యంవధ, ఇరుసు, జ్వాలాశిఖలు లాంటి నాటకాలను ప్రదర్శనతో ఆయనకు మంచి పేరు వచ్చింది. మద్రాసులో అడుగుపెట్టిన తర్వాత ఆయన దాసరి గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఆయన మహమ్మద్ బీన్ తుగ్లక్, శివరంజని, రంగూన్ రౌడీ, రాముడే రావణుడు లాంటి సినిమాలకు సహాయ దర్శకుడిగా చేశారు. ఆ తర్వాత సుప్రీం హీరో చిరంజీవితో ఒక సినిమా చేశారు. 1980లో రామరాజు నిర్మాణము, ధవళ సత్యం దర్శకత్వంలో చిరంజీవి, లీలావతి హీరో, హీరోయిన్లుగా జాతర సినిమాలో నటించారు.

ఆ తర్వాత ఎర్రమల్లెలు, యువతరం కదిలింది, గుడి గంటలు మ్రోగాయి, రామాపురంలో సీత, భీముడు లాంటి సినిమాలను రూపొందించారు. ఆ తర్వాత మాదాల రంగారావు కొడుకు మాదాలరవి తో నేను సైతం అనే సినిమాను రూపొందించారు. గిరిజన స్థితిగతులను చూసి, స్పందించిన ధవళ సత్యం వారి జీవన విధానాలపై ఒక సినిమా రూపొందించాలనుకున్నారు. ఆ క్రమంలో గిరిజనతండాలో ఒక మహిళకు ఎదురైన ప్రతిబంధకాలు, వాటిని ఎదుర్కోవడంలో ఆ మహిళ ఏ విధంగా పోరాటం చేసి చివరికి గెలిచిందో అనే అంశంపై ఆ రోజుల్లో సపోర్టింగ్ రోల్స్ లో శరత్ బాబు, శ్రీనివాసవర్మ, శారద ప్రధానపాత్రలో “మన్యంలో మంగమ్మ” సినిమా షూటింగ్ ధవళ సత్యం మొదలుపెట్టారు.

దాదాపు పదిహేను రోజుల వరకు షూటింగ్ జరిగిన తర్వాత కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత సినిమాకు సంబంధించిన కథ శారద ద్వారా ఇతర రచయిత, దర్శకులకు తెలిసింది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత 1997లో విజయశాంతి ప్రధాన పాత్రలో దాసరి నారాయణరావు ‘ఒసేయ్ రాములమ్మ’ అనే చిత్రాన్ని రూపొందించడం జరిగింది. అయితే శారద ప్రధానపాత్రలో మన్యంలో మంగమ్మ అనే ఆగిపోయిన సినిమా కథ, ఒసేయ్ రాములమ్మ కథ ఒకటేనని.. దవళ సత్యం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ప్రేమించి పెళ్లి… చివరకు భర్త హత్య! హోలోగ్రామ్‌తో బయటపడిన షాకింగ్ కుట్ర

ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…

18 minutes ago

అషు రెడ్డి-టెక్కీ వివాదంలో ఆడియో బాంబ్

బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…

21 minutes ago

ఒక్క ఛాన్స్ కోసం తిరిగిన సత్యరాజ్.. కట్టప్పగా వరల్డ్ ఫేమ్

దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…

23 minutes ago

“ఆ హీరో నా జీవితంలో గాడ్ ఫాదర్”.. అనుష్క ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…

30 minutes ago

“వినాశకాలే విపరీత బుద్ధి”.. యువతకు కఠిన హెచ్చరిక

ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…

1 hour ago

మోదీని డైరెక్ట్‌గా కలుస్తా.. మంచు లక్ష్మి రాజకీయ వ్యాఖ్యలు వైరల్

టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…

3 hours ago