బుల్లితెరపై ఎంతో క్రేజ్ ను సంపాదించుకొని టాప్ వన్ రియల్ గా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సీరియల్ కి రెండు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.అయితే తాజాగా కార్తీకదీపం సీరియల్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. త్వరలోనే కార్తీకదీపం సీరియల్ శుభం కార్డు పడుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలోనే ఈ సీరియల్ ముగుస్తుండటంతో ఆ తరువాత ఈ సీరియల్ ఒక సినిమాలాగా నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది విన్న నెటిజన్లు ఏంటి.. నిజంగానే కార్తీకదీపం సీరియల్ సినిమా లాగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుందా అంటూ..? ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజు అరగంట పాటు బుల్లితెరపై గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారమవుతున్న వంటలక్క సీరియల్ ఇప్పుడు ఏకంగా ఓటీటీ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుందని తెలియడంతో అభిమానులు తెగ సంబర పడుతున్నారు. ఈ సీరియల్ సినిమాలాగా రానుందని తెలియడంతో వంటలక్క అలియాస్ దీప కూడా మలయాళం సీరియల్ కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా బుల్లితెరపై రికార్డులు సృష్టిస్తున్న కార్తీకదీపం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతుందంటే అభిమానులకు పండగనే చెప్పవచ్చు. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…