సినిమా పరిశ్రమలో హీరోలతో పోల్చితే హీరోయిన్లకు కెరీర్ చాలా తక్కువ. కొన్ని సినిమాలు చేసిన తర్వాత నెమ్మదిగా వెండి తెర నుంచి దూరం అవుతారు. సినిమా విజయం సాధించినా.. హీరోతో పోల్చితే హీరోయిన్ కు వచ్చే పేరు కూడా తక్కువగానే ఉంటుంది.
అయితే కొందరు హీరోయిన్లు మాత్రం హీరోలకు ఏమాత్రం తగ్గకుండా క్రేజ్ సంపాదించుకున్నారు. అలాంటి లెజెండరీ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
భానుమతి
భానుమతి నటిగానే కాకుండా చాలా రంగాల్లో అద్బుత ప్రతిభ కనబరచింది. ఓ వైపు హీరోయిన్ గా చేస్తూననే మరోవైపు నిర్మాతగా, రచయిత్రిగా, గాయకురాలిగా సత్తా చాటింది. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
సావిత్రి
తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో అద్భుత సినిమాలు చేససిన నటీమణి. తన అభినయంతో మహానటిగా గుర్తింపు తెచ్చుకుంది.
జమున
పౌరాణిక, జానపద సినిమాల్లోఅద్బుతంగా రాణించింది ఈ నటీమణి. సత్యభామ లాంటి పాత్రలకు జీవం తెచ్చింది కూడా తనే అని చెప్పుకోవచ్చు.
వాణిశ్రీ
తెలుగు సినిమా పరిశ్రమలోని టాప్ హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబుతో నటించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది.
విజయశాంతి
హీరోలతో సమానమైన పారితోషికం తీసుకున్న నటీమణి. టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది.
శ్రీదేవి
అందం, అభినయంతో అతిలోక సుందరిగా పేరుపొందింది శ్రీదేవి.
రమ్యకృష్ణ
గ్లామర్ పాత్రలతో పాటు అన్ని రకాల పాత్రలు చేసింది రమ్య.
విజయ నిర్మల
పలు హిట్ సినిమాల్లో నటించిన ఈమె.. ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది.
సూర్యాకాంతం
గయ్యాలి పాత్రకు కేరాఫ్ గా నిలిచింది ఈ నటీమణి. తన పాత్రను చూడగానే జనాలకు చిర్రెత్తేలా చేసింది.
నిర్మలమ్మ
బామ్మ పాత్రలు అనగానే గుర్తొచ్చేలా పేరు సంపాదించింది నిర్మలమ్మ. ఎన్నో సినిమాల్లో బామ్మ పాత్ర చేసి సొంతింటి మనిషిలా నిలిచిపోయింది ఈ నటీమణి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…