General News

ఫోటో వైరల్: బంగారు మాస్కు ధరించిన బాబా.. మాస్క్ ధర ఎంతంటే!

ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నటువంటి కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బయటకు వెళ్లాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. లేదంటే ఈ మహమ్మారి బారిన పడాల్సి వస్తుంది.ఈ క్రమంలోనే మనకు మార్కెట్లోకి ఎన్నో రకాల మాస్కులు అందుబాటులోకి వచ్చాయి.

క్లాస్ మాస్క్ లు, సర్జికల్ మాస్కులు, ఎన్ -95 మాస్క్, వంటి వివిధ రకాల మాస్కులు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి.ఈ విధంగా మాస్క్ లను ధరించి బయటకు వెళ్లడం వల్ల కరోనా నుంచి కొంత వరకు మనల్ని మనం రక్షించుకోవచ్చు.అయితే మార్కెట్లో ఇన్ని రకాల మాస్కులు అందుబాటులో ఉన్నప్పటికీ ఓ వ్యక్తి మాత్రం అందరికీ ఎంతో భిన్నంగా బంగారంతో తయారు చేయించిన మాస్క్ ధరించాడు.ఈ విధంగా బంగారు మాస్క్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన మనోజ్‌ సెంగార్‌ మాస్క్‌ను బంగారంతో మాస్క్ చేయించుకున్నారు. గోల్డెన్‌ బాబాగా పేరుగాంచిన మనోజానంద మహారాజ్‌ బంగారం మాస్కును ధరించాడు. ఈ సందర్భంగా ఇతను మాట్లాడుతూ తన చేయించుకున్న మాస్క్ మూడు పొరలతో తయారయిందని, దీనిని పూర్తిగా శానిటైజర్ చేసి ఉందని తెలిపారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాపించి ఉన్న కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండటం కోసం తన ఈ విధంగా అక్షరాల ఐదు లక్షల రూపాయలను ఖర్చు చేసి ఈ విధమైనటువంటి బంగారు మాస్క్ తయారు చేయించుకున్నట్లు తెలిపారు. ఈ మాస్క్ ధరించడం వల్ల తను పూర్తిగా వైరస్ నుంచి రక్షణ పొందుతారని, తన బంగారం మాస్క్ 3 సంవత్సరాల పాటు పని చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా బంగారం మాస్క్ ధరించినటువంటి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago