Movie News

Bigg Boss 7: రతికకు షాక్ ఇవ్వబోతున్న రైతు బిడ్డ… బయటకు రాబోతున్న రతిక!

Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం నేటితో 12 వారాలను పూర్తి చేసుకోబోతుంది. ఇక ఫైనల్స్ కు మూడు వారాలు మాత్రమే ఉండడంతో ఈవారం డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తుంది. అయితే శనివారం అశ్విని హౌస్ నుంచి బయటకు తీసుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక నేడు హౌస్ నుంచి ఎవరు బయటికి రానున్నారు అనే విషయం గురించి ఆసక్తి నెలకొంది.

సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం ఈ వారం రతిక బయటకు రాబోతున్నారని తెలుస్తుంది.
ఈ వారం నామినేషన్స్ లో భాగంగా ప్రియాంక, శోభా శెట్టి మాత్రమే లేరు మిగిలిన వారందరూ కూడా నామినేషన్స్ లో ఉన్నారు. ఇప్పటికే అశ్విని బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు. ఇక డేంజర్ పొజిషన్లో ఉన్నది అర్జున్ రతిక. ఈరోజు వీరిద్దరిలో ఎవరో ఒకరు బయటకు రావాల్సి ఉంది.

ఈవారం హౌస్ నుంచి రతిక నేడు ఎలిమినేట్ కాబోతుందని తెలుస్తుంది. అర్జున్ కోసం పల్లవి ప్రశాంత్ తన వద్ద ఉన్నటువంటి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడబోతున్నారని దాంతో అర్జున్ సేఫ్ అవ్వగా రతిక బయటకు రాబోతున్నారని తెలుస్తుంది. ఇక ఏవిక్షన్ ఫ్రీ పాస్ రతికకు ప్రశాంత్ అసలు ఉపయోగించరు. ఈమె తిరిగి హౌస్ లోకి వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ను బాగా టార్గెట్ చేశారు.

ఎలిమినేట్ కానున్న రతిక

ఇలా రతిక కోసం పల్లవి ప్రశాంత్ ఎలాంటి పరిస్థితులలోను ఏవిక్షన్ పాస్ ఉపయోగించే అవకాశం లేదని తెలుస్తుంది. దీంతో రైతుబిడ్డ దెబ్బకు రతిక బయటకు రాబోతుందని తెలుస్తుంది. మొదట్లో కూడా ఈమెను పల్లవి ప్రశాంత్ నామినేషన్ లోకి తీసుకువచ్చారు. అప్పుడు కూడా ఈమె ఎలిమినేట్ అయితే మరి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు ఈసారి కూడా పల్లవి ప్రశాంత్ కారణంగానే బయటకు పోతుందని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago